సెక్రటేరియట్ కూల్చివేత కవరేజీకి అనుమతివ్వండి

సెక్రటేరియట్ కూల్చివేత కవరేజీకి అనుమతివ్వండి

హైకోర్టులో వీ6 చానల్, వెలుగు దినపత్రిక పిటిషన్

హైదరాబాద్, వెలుగు: సెక్రటేరియట్ బిల్డింగ్స్ కూల్చివేత ఫొటోలు, వీడియో కవరేజీ కోసం మీడియాను అనుమతించాలని కోరుతూ వీ6 చానల్, వెలుగు దినపత్రిక హైకోర్టులో సోమవారం రిట్ పిటిషన్ వేసింది. కూల్చివేత పనులను కవర్ చేయకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించిందని, మీడియాను దరిదాపుల్లోకి అనుమతించడం లేదనే విషయాన్ని అందులో వివరించింది. ప్రజల డబ్బుతో కట్టిన అధికారిక భవనాలను కూలగొట్టినా, కొత్తవి కట్టినా తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంటుందని పిటిషన్లో ప్రస్తావించింది. వాటిని రహస్యంగా ఉంచటం అన్యాయమని, రాజ్యాంగం కల్పించిన పత్రిక స్వేచ్ఛను హరించడమే అవుతుందని పేర్కొంది. మీడియా కవరేజీకి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన పలు కీలక తీర్పులను ప్రస్తావించింది. హైకోర్టు వెంటనే జోక్యం చేసుకోవాలని, సెక్రటేరియట్ కూల్చివేత కవరేజీకి మీడియాను అనుమతించేలా సర్కారుకు ఆదేశాలు ఇవ్వాలని వీ6 చానల్, వెలుగు దినపత్రిక తన పిటిషన్లో కోరింది.

For More News..

20 రోజుల్లో 5 లక్షల కేసులు

ప్రజల ప్రాణాలు గాలికి వదిలేసి.. ఏం ఎల్గవెడ్తున్నరు?

శ్రావణం లగ్గాలకు కరోనా అడ్డం