
హైదరాబాద్, వెలుగు : దీపావళి పండుగను పురస్కరించుకుని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ ఎదురుచూస్తున్న మూడు పెండింగ్ డీఏల విడుదలకు అనుమతినివ్వాలని సీఈఓ వికాస్ రాజ్ ను టీఎన్జీవో కేంద్ర సంఘం సభ్యులు కోరారు. పెండింగ్ డీఏలను రిలీజ్ చేసేలా చూడాలని ఎన్నికల కమిషన్ అనుమతించాలన్నారు. సీఈఓను కలిసిన వారిలో టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ , టీఎన్జీవో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకట్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మూజీబ్ హుస్సేనీ తదితరులు ఉన్నారు.