ముంబైలో బన్నీ యాక్షన్ సీన్స్

ముంబైలో బన్నీ యాక్షన్ సీన్స్

అల్లు అర్జున్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో ఓ భారీ పాన్ ఇండియా  చిత్రం తెరకెక్కుతోన్న  సంగతి తెలిసిందే.  హాలీవుడ్ టెక్నీషియన్స్‌‌‌‌‌‌‌‌తో సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే ముంబైలో కొంతభాగం షూట్ చేశారు. రీసెంట్‌‌‌‌‌‌‌‌గా తను నటించిన ‘పుష్ప’ చిత్రం జపాన్‌‌‌‌‌‌‌‌లో విడుదలవగా ప్రమోషన్స్ కోసం అక్కడికి వెళ్లిన బన్నీ ఆదివారం ముంబైకి చేరుకున్నాడు. సోమవారం నుంచి ముంబైలో మరో కీలక షెడ్యూల్‌‌‌‌‌‌‌‌లో జాయిన్ అవుతున్నాడు.  

ఈ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌లో ఇంపార్టెంట్ సీన్స్‌‌‌‌‌‌‌‌తోపాటు హై-ఇంటెన్సిటీ స్టంట్స్, యాక్షన్ సీక్వెన్స్‌‌‌‌‌‌‌‌లు  చిత్రీకరిస్తున్నారు.  దీనికోసం ఓ భారీ సెట్‌‌‌‌‌‌‌‌ను వేయగా, మరో నెలరోజులపాటు అక్కడే షూటింగ్ కొనసాగనుందని తెలుస్తోంది.  సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కుతోన్న  ఈ చిత్రంలో అల్లు అర్జున్ మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్‌‌‌‌‌‌‌‌లో కనిపించబోతున్నాడట.  దీపికా పదుకొనె హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది.  అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్‌‌‌‌‌‌‌‌లు, హాలీవుడ్ స్థాయి విజువల్స్ ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్‌‌‌‌‌‌‌‌గా నిలుస్తాయని తెలుస్తోంది.  వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తిచేసి ఆగస్టు నుంచి  లోకేష్ కనగరాజ్ రూపొందించనున్న మూవీకి సమయం కేటాయించేలా అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నాడట.