Jr NTR Birthday: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. ఎన్టీఆర్కి అల్లు అర్జున్ శుభాకాంక్షలు

Jr NTR Birthday: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. ఎన్టీఆర్కి అల్లు అర్జున్ శుభాకాంక్షలు

జూనియర్ ఎన్టీఆర్.. ఈ పేరుకు ప్రత్యేకమైన ఫాల్లోవింగ్ ఉంది. ఎన్టీఆర్ అనే పేరు వినబడితే చాలు .. దేశ నలుమూలలా ఉన్న ఫ్యాన్స్ కు పూనకాలు వస్తాయి. తాత ఘన వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని.. బాల నటుడిగా మొదలు.. నేటి వరకు తన సత్తా చాటుతూ వస్తున్నాడు. తాతకు తగ్గ మనవడిగా యాక్టింగ్తో అదరగొడుతున్నారు.

దాంతో తన నుంచి సినిమా వస్తుందంటే చాలు అది పండగ రోజే అనేలా క్రియేట్ చేశాడు. అంతేకాదు.. మే 20 వచ్చిన చాలు అది ఫ్యాన్స్ కు కనువిందే అనేలా మార్చేశాడు. ఎందుకంటే ఆరోజు ఆయన పుట్టినరోజు. నేడు మంగళవారం మే20న ఎన్టీఆర్ 42వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు.

ఈ సందర్భంగా తారక్కు ఇండస్ట్రీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)ఎన్టీఆర్కు సోషల్ మీడియాలో వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.

తన ఎక్స్ ఖాతాలో హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలి అని తెలిపాడు. 'పుట్టినరోజు శుభాకాంక్షలు తారక్ బావా.. మీకు విజయం, ఆనందం & సంతోషం కలగాలని కోరుకుంటున్నాను' అని Xవేదికగా ట్వీట్ చేశాడు. 

ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన దర్శకుడు కొరటాల శివతో దేవర 2 సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమా మొదటి పార్ట్ ఘానా విజయం సాధించింది. ఇక ఎన్టీఆర్ బర్త్ డే సందర్బంగా నేడు వార్ 2 నుంచి అప్డేట్ రానుంది. ఎన్టీఆర్-నీల్ మూవీ నుంచి ఏదైనా పోస్టర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.