Pushpa2TheRule: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2: ది రూల్ సినిమా డిసెంబర్ 05న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో రష్మిక మందాన, జగపతిబాబు, రావు రమేష్, అజయ్, కల్పలత, ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, ధనుంజయ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన పుష్ప 2 ఆడియన్స్ అంచనాలని దాదాపుగా అందుకుందని చెప్పవచ్చు. ముఖ్యంగా నార్త్ లో అల్లు అర్జున్ కి మంచి క్రేజ్ ఉండటంతో మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.
ఈ క్రమంలో కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ అయిన మొదటిరోజే రూ.72 కోట్లు (నెట్) కలెక్షన్స్ సాధించి రికార్డులు క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పటివరకూ బాలీవుడ్ లో తెలుగు సినిమాలు చాలా రిలీజ్ అయ్యాయి.
కానీ బాలీవుడ్ లో అధిక కలెక్షన్లు సాధించిన మొదటి తెలుగు సినిమాగా పుష్ప 2 రికార్డ్ క్రియేట్ అయ్యింది. అయితే ఇప్పటివరకూ బాలీవుడ్ లో మొదటిరోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల లిస్టులో స్టార్ హీరో బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ (రూ.64 కోట్లు) చిత్రం టాప్ లో కొనసాగుతోంది.
ఈ రికార్డులను కూడా పుష్ప 2 సులభంగా బ్రేక్ చేసింది. దీన్నిబట్టి చూస్తే బన్నీ కి హిందీలో ఉన్న క్రేజ్ అర్థమవుతుంది. అయితే ఇటీవలే ప్రముఖ హీరో ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాని హిందీలో కూడా రిలీజ్ చేశారు. కానీ ఈ సినిమా హిందీ వెర్షన్ టోటల్ కలెక్షన్లు రూ.75 కోట్లు ఉంది. అయితే పుష్ప 2 సినిమాని హిందీలో దాదాపుగా 1500 కి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ చేశారు.
దీంతో ప్రతీచోట మొత్తం ఆక్యుపెన్సీతో విజయవంతంగా ఈ సినిమాని ప్రదర్శిస్తున్నారు. అయితే మొదటి రోజే మంచి కలెక్షన్లు రావడం, పాజిటివ్ టాక్ ఉండటం వంటి విషయాలతో పుష్ప 2 రెండో రోజుకూడా ఇదే ఊపు కంటిన్యూ చేస్తూ రూ.150 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇక వరల్డ్ వైడ్ గా పుష్ప2 మొదటిరోజు దాదాపుగా రూ.280 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసినట్లు సమాచారం.