
స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప ది రూల్ (Pushpa2TheRule). తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్.
"నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే..అంటూ సాగే సాంగ్లో పుష్ప..పుష్ప..పుష్ప..పుష్ప రాజ్ అనే ట్యాగ్ తో ఉన్న ఈ సాంగ్ అల్లు అర్జున్ మేనియాను మరింత రెట్టింపు చేసే ఉత్సాహంగా ఉంది.ఈ పాటకు ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్ లిరిక్స్ అందించగా..నకాష్ అజీజ్ మరియు దీపక్ పాడారు.
ఈ సాంగ్లో దేవి శ్రీ ట్యూన్,హుషారైన బిజియమ్,సింగర్స్ గొంతు,అల్లు అర్జున్ స్వాగ్ అదిరిపోయాయి.సెన్సేషనల్ సర్‌ప్రైజ్‌తో..సెన్సేషనల్ సాంగ్ తెలుగు,హిందీ,తమిళం,కన్నడ,మలయాళం &బెంగాలీ భాషల్లో రిలీజ్ అయింది..అంటే ఒక మనిషి 6 భాషల్లో..ఒక మంత్రంతో గూస్‌బంప్స్ తెప్పిస్తుండటంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలాగే ఈ సాంగ్ లో వచ్చే ఐకానిక్ స్టెప్పులకు కాన్సెప్ట్ డైరెక్టర్ గా ప్రేమ్ రక్షిత్ వ్యవహరించగా..విజయ్ పొలంకి మరియు శ్రేష్ట్ వర్మ డ్యాన్స్ సమకూర్చారు.
రాక్ స్టార్ DSP సంగీత సారథ్యంలో వచ్చిన ఈ సాంగ్ పుష్పాగాడి క్యారెక్టర్ ను తెలిపే మాస్ గీతంగా ఉంది. దీంతో నేటి నుంచి పుష్ప చాంటింగ్ షురూ మొదలైంది.ఈ సాంగ్ లో అల్లు అర్జున్ లుక్ తగ్గేదేలే అన్నట్టుగా ఉంది.మరి ఈ పుష్ప గాడి సాంగ్ తో ఊగిపోవడానికి సిద్ధం అయ్యారా..మై డియర్ ఐకాన్స్.
ఇప్పటికే పుష్ప పార్ట్ 1 సాంగ్స్ ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బాస్టర్ అయ్యాయి. దేవి శ్రీ ఇచ్చిన ట్యూన్స్ కి భాషతో సంబంధం లేకుండా డ్యాన్స్ చేయడం..హుమ్మింగ్ చేయడం చేస్తూ ఎంజాయ్ చేశారు. ఇక ఇప్పుడు పుష్ప 2 ఆగమనం మొదలవ్వడంతో..పార్ట్ 2కి సంబంధించిన సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయనేది..ఈ ఒక్క సాంగ్ తో తెలిసిపోయింది.ఇంకా ఆలస్యం ఎందుకు డీజే బాక్స్ లలో మోగించేసేయండి ఐకాన్స్.