Pushpa2 Teaser: పుష్ప2 టీజర్ వచ్చేసింది.. అమ్మవారి అవతారంలో పూనకాలు తెప్పించాడయ్యా!

Pushpa2 Teaser: పుష్ప2 టీజర్ వచ్చేసింది.. అమ్మవారి అవతారంలో పూనకాలు తెప్పించాడయ్యా!

స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప ది రూల్. ఈ సినిమా టీజర్ కోసం ఆయన ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వారి ఎదురుచూపులు ఎండ్ కార్డు వేస్తూ టీజర్ విడుదల చేశారు మేకర్స్. తాజాగా ఏప్రిల్ 8 అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్బంగా పుష్ప 2 టీజర్ విడుదల చేశారు. 

మోస్ట్ యాంటిసిపేటెడ్ టీజర్ గా వచ్చిన ఈ వీడియో నెక్స్ట్ లెవల్లో ఉంది. అమ్మవారి అవతారంలో అదరగొట్టేశాడు అల్లు అర్జున్. జాతర సీక్వెన్స్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ తో టీజర్ కట్ చేశారు. ఆధ్యంతం పూనకాలు తెప్పించిన టీజర్ లో.. విలన్ ను కాలితో తన్ని అదే కాలితో చీర కొంగుని తీసుకొని నడుములో చిక్కుకునే సీన్ అయితే మాస్.. ఊర మాస్ అనే రేంజ్ ఉంది. ఇక టీజర్ లో దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ గోస్ బంప్స్ తెప్పించేలా ఉంది. మొత్తంగా టీజర్ పుష్ప 2 సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇక ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయనుందో చూడాలి.