V6 News

Allu Arjun: యాక్టింగ్తో రణ్‌‌‌‌‌‌‌‌వీర్ చింపేశాడు.. మూవీ నాకు చాలా నచ్చింది: ధురంధర్ రివ్యూ ఇచ్చిన అల్లు అర్జున్

Allu Arjun: యాక్టింగ్తో రణ్‌‌‌‌‌‌‌‌వీర్ చింపేశాడు.. మూవీ నాకు చాలా నచ్చింది: ధురంధర్ రివ్యూ ఇచ్చిన అల్లు అర్జున్

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌‌‌‌‌‌‌‌వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘‘ధురంధర్’’ దుమ్మురేపుతోంది. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ధురంధర్ మూవీపై రివ్యూ ఇచ్చారు. సినిమా అద్భుతంగా ఉంది. నాకు చాలా నచ్చింది తప్పకుండా చూడండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు బన్నీ.  

‘‘ఇప్పుడే ధూరందర్ సినిమా చూశాను. దర్శకుడు ఆదిత్యధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అద్భుతంగా తెరకెక్కించాడు. పూర్తి స్వాగ్‌తో ఆదిత్య అదరగొట్టారు నా సోదరుడు రణ్‌‌‌‌‌‌‌‌వీర్ సింగ్ తన వర్సటైల్ యాక్టింగ్తో చింపేశాడు. అలాగే, ఛావా మూవీ విలన్ అక్షయ్ ఖన్నా, హీరో మాధవన్, అర్జున్ రాంపాల్ మరియు సారా అర్జున్ వంటి టాలెండ్ యాక్టర్స్ తో సినిమా మైండ్ బ్లోయింగ్గా ఉంది. ముఖ్యంగా టెక్నీకల్ టీమ్ & సౌండ్‌ట్రాక్‌ ఈ సినిమాకు ఇంపాక్ట్ తీసుకొచ్చాయి. మొత్తం చిత్ర బృందానికి మరియు సాంకేతిక నిపుణులు, నటీనటులు, నిర్మాత, జియో స్టూడియో ప్రెసిడెంట్ జ్యోతి దేశ్‌పాండే వారికి అభినందనలు. నాకు చాలా నచ్చింది! తప్పకుండా చూడండి మరియు ఈ సినిమాను ఆస్వాదించండి మిత్రులారా’’ అని అల్లు అర్జున్ రివ్యూ పంచుకున్నారు. 

‘ధురంధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ మూవీ (2025 డిసెంబర్ 5న) రిలీజై దుమ్మురేపే వసూళ్లు కలెక్ట్ చేస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల నెట్ మార్కును దాటి, ధురంధర్ అద్భుతమైన ఓపెనింగ్ అందుకుంది. అదే ఊపును కొనసాగిస్తూ వీకెండ్ పూర్తయ్యేసరికి ఇండియా వైడ్ గా రూ.207.25 కోట్లకి పైగా వసూలు చేసింది. ఓవర్సీస్లో సైతం మంచి కలెక్షన్స్ రాబడుతోంది.

►ALSO READ | Gurram Paapi Reddy: డార్క్ కామెడీతో ఇంట్రెస్టింగ్ తెలుగు ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌.. నరేష్ అగస్త్య ‘గుర్రం పాపిరెడ్డి’ విశేషాలు

రణవీర్ సింగ్ ప్రీవియస్ మూవీస్ అయిన "పద్మావత్ మరియు సింబా" తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన మూడవ సినిమాగా నిలిచింది. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన సింబా రూ.240 కోట్ల నెట్ వసూలు చేసింది. సంజయ్ లీలా భన్సాలీ యొక్క పద్మావత్ రూ.302 కోట్ల ఇండియా నెట్  అందుకుంది. సినిమా రిలీజై వారం గడిచినప్పటికీ.. అదిరిపోయే బుకింగ్స్ జరుగుతున్నాయి. ఈ స్వాగ్ ఇలానే కొనసాగితే దురంధర్ రికార్డ్ కలెక్షన్స్ సాధించడం పక్కా అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి