చేతిలోన గొడ్డలట.. చేసిందే యుద్ధమట

చేతిలోన గొడ్డలట.. చేసిందే యుద్ధమట

‘ఆ పక్కా నాదే .. ఈ పక్కా నాదే .. తలపైన ఆకాశం ముక్కా నాదే.. నను మించి ఎదిగేటోడు ఇంకోడు ఉన్నాడు చూడు.. ఎవడంటే అది రేపటి నేనే’ అంటున్నాడు పుష్పరాజ్. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో అల్లు అర్జున్ హీరోగా సుకుమార్‌‌‌‌ తెరకెక్కిస్తున్న ‘పుష్ప’ నుంచి ఇప్పటికే మూడు పాటలు విడుదల చేసిన టీమ్, నాలుగో పాటని నిన్న రిలీజ్ చేసింది. దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్‌‌కి.. ‘సేతిలోన గొడ్డలట.. సేసిందే యుద్ధమట.. సేయందే సంధి అట’ అంటూ సింపుల్ లైన్స్‌‌తో బన్నీ క్యారెక్టర్‌‌ కళ్లకు కట్టేలా లిరిక్స్ రాశారు చంద్రబోస్. నకాష్ అజీజ్ పాడాడు. ‘ఎవడ్రా ఎవడ్రా నువ్వు అంటే ఇనుమును నేను, నను కాల్చితే కత్తి అవుతాను.. మట్టిని నేను, నను తొక్కితే ఇటుకవుతాను.. రాయిని నేను, గాయం కానీ చేశారంటే ఖాయంగా దేవుడిని అవుతాను’ లాంటి పదాలు ఆకట్టుకున్నాయి. ప్రేమ్ రక్షిత్, గణేశ్ కొరియోగ్రఫీలో పక్కా మాస్‌‌ స్టెప్పులతో ఆకట్టుకున్నాడు బన్నీ. రష్మిక హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ  చిత్రంలో ఫహాద్‌‌ ఫాజిల్, సునీల్, అనసూయ, ధనుంజయ్, రావు రమేష్, అజయ్ ఘోష్  ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సమంత స్పెషల్ సాంగ్ చేస్తోంది. ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్  ‘పుష్ప: ది రైజ్’ పేరుతో క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 17న విడుదల కానుంది.