ఇన్‌స్పైర్‌‌ అవ్వాలి గానీ అసూయ పడొద్దు

ఇన్‌స్పైర్‌‌ అవ్వాలి గానీ అసూయ పడొద్దు

‘మన తర్వాత వచ్చిన వారు పైకి ఎదిగారని మనం జలస్ ఫీలయితే దానర్ధం మనం పరిగెత్తడం లేదని. వాళ్లని చూసి ఇన్‌స్పైర్‌‌ అవ్వాలి గానీ అసూయ పడొద్దు. అలా కష్టపడి ఎదిగేవాళ్లు మరింత ముందుకు వెళ్లాలని కోరుకోవాలి’ అంటూ విజయ్ దేవరకొండను ఉద్దేశించి మాట్లాడాడు అల్లు అర్జున్. విజయ్ దేవరకొండ సమర్పణలో ఆనంద్ దేవరకొండ హీరోగా రూపొందిన ‘పుష్పకవిమానం’ ట్రైలర్‌‌‌‌ లాంచ్‌‌ ఈవెంట్‌‌కి అల్లు అర్జున్ చీఫ్‌‌ గెస్ట్‌‌గా హాజరయ్యాడు. గీత్ సైని, శాన్వి మేఘన హీరోయిన్స్‌‌గా నటించిన ఈ సినిమాకు దామోదర దర్శకుడు. విజయ్‌‌ తండ్రి గోవర్ధన రావు, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి కలిసి నిర్మించారు. నవంబర్ 12న సినిమా రిలీజ్. అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘ట్రైలర్ చాలా బాగుంది. సినిమాపై పాజిటివ్ వైబ్ ఉందని ఆల్ ద బెస్ట్ చెప్పకుండా అడ్వాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నా.  విజయ్ దేవరకొండ సెల్ఫ్ మేడ్ యాక్టర్. సినిమాల్లోనే కాదు, బిజినెస్, ప్రొడక్షన్‌‌లోనూ ఎక్స్‌‌పెరిమెంట్స్ చేస్తున్నాడు. తనలా సొంతంగా కష్టపడి పైకొచ్చే వాళ్లను నేను అభిమానిస్తాను. విజయ్ ఎదుగుదల నా విజయం అనుకుంటాను. తను మరింత పైకి ఎదగాలి. ఈ సినిమాతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతాడు. హీరోయిన్స్ ఇద్దరూ తెలుగు వాళ్లే అవ్వడం హ్యాపీ. ఆనంద్ సెలెక్ట్ చేసుకునే సినిమాలు చాలా బాగుంటాయి. కంఫర్ట్ జోన్‌‌లో లేకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. ప్రతి ఒక్కరిలోనూ ఒక యూనిక్ టాలెంట్ ఉంటుంది. ఎవరితోనూ కంపేర్ చేసుకోకుండా సొంత టాలెంట్‌‌ ఉంటేనే పైకొస్తాం. అందరూ దానిని గుర్తుంచుకోవాలి.  పునీత్ రాజ్‌‌కుమార్ అంటే చాలా ఇష్టం. ఆయన మరణ వార్త విని షాక్ అయ్యాను. ఎవరు ఎప్పుడు చనిపోతామో తెలియదు కనుక.. లైఫ్‌‌లో హ్యాపీగా ఉండాలి’ అన్నాడు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘నా ప్రొడక్షన్‌‌లో వస్తోన్న రెండో సినిమా ఇది. చిన్న సినిమాలకు సపోర్ట్‌‌గా, మంచి స్ర్కిప్ట్‌‌లను, కొత్త డైరెక్టర్స్‌‌ను ఎంకరేజ్ చేయడానికే ప్రొడక్షన్ హౌస్ పెట్టాను. ఇందులో హీరో పడే కష్టాలను చూసి అందరూ నవ్వుతారు. కానీ ఇలాంటి క్యారెక్టర్ చేయడానికి ఎవరూ ఒప్పుకోరు. అయినా ఆనంద్ ముందుకొచ్చి నటించాడు.  సపోర్ట్ చేయడానికి వచ్చిన బన్నీ అన్నకు థ్యాంక్స్. నేను ఆయన్ను కాంపిటిటీవ్ స్పిరిట్‌‌గా, ఇన్‌‌స్పిరేషన్‌‌గా తీసుకుంటాను.  ‘పుష్ప’ విజువల్స్‌‌లో పుష్పరాజ్‌‌ తప్ప అల్లు అర్జున్‌‌ ఎక్కడా కనిపించడం లేదు’ అని చెప్పాడు.  ‘ఈ సినిమాలో మంచి కామెడీ, సస్పెన్స్, మిస్టరీ లాంటివన్నీ ఉంటాయి. బన్నీ అన్న ట్రైలర్ రిలీజ్ చేయడం బిగ్ బూస్టప్‌‌ ఇచ్చినట్టుంది. బన్నీ, విజయ్ అన్నలను చూస్తుంటే ఫ్రంట్ రన్నర్స్‌‌గా అనిపిస్తున్నారు’ అని ఆనంద్ అన్నాడు. ‘ఫస్ట్ పెళ్లికార్డు దేవుడికి ఇచ్చినట్టు మా మూవీ ఫస్ట్ కార్డును అల్లు అర్జున్‌‌కి ఇచ్చాం. ప్రేక్షకుల విలువైన సమయాన్ని వేస్ట్ చేయకూడదని ఇలాంటి  కథను రాశాను. విజయ్ మాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. కొత్త కాన్సెప్ట్‌‌తో వస్తోన్న  కామెడీ థ్రిల్లర్ ఇది. చిట్టిలంక సుందర్ పాత్రలో‌ ఆనంద్ అందర్నీ ఆకట్టుకుంటాడు’ అని దర్శకుడు దామోదర చెప్పాడు. ‘ట్రైలర్‌‌‌‌కి పదిరెట్లు ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది’ అని చెప్పారు హీరోయిన్స్.  నటులు కిరిటీ, అజయ్, గిరిధర్, అభిజిత్ తదితరులు పాల్గొన్నారు.