ఎప్పటికైనా నా దేవుడు ఆయనే.. అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్

ఎప్పటికైనా నా దేవుడు ఆయనే.. అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్ చేసాడు. రీసెంట్ గా ఈ హీరో ప్రముఖ ఓటీటీ ఆహాలో ప్రసారమవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ షోకి హాజరయ్యాడు. ఈ షో సీజన్ 2 ఫైనల్ కు చేరుకోగా.. విజేతలకు అవార్డ్స్ ఇచ్చేందుకు ఆయన హాజరయ్యాడు. ఇందులో భాగంగా మాట్లాడిన అల్లు అర్జున్..  “దేవుడు ఎలా ఉంటాడో నాక తెలియదు. నాకు తెలిసిన దేవుడు ఒక్కడే.. ఆయనే మా నాన్న. ఆయనే నాకు అన్ని ఇచ్చింది” అంటూ ఎమోషనల్ అయ్యాడు. 

ప్రస్తతం అల్లు అర్జున్ కు సంబంధించిన ఈ వీడియో నేట్టింట వైరల్ గా మారింది. ఇక ఐకాన్ స్టార్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప ది రూల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. పాన్ ఇండియాలో లెవల్లో రానున్న ఈ సినిమాలో రష్మిక మందనా హీరోయిన్ గా నటిస్తోంది.

 రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను.. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో గానీ.. వచ్చే ఏడాది మొదట్లో గానీ ప్రేక్షకుల ముందుకు రానుంది. పార్ట్ వన్ లాగే ఈ సినిమా కూడా రిలీజ్ తరువాత ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేయనుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.