
రామ్ చరణ్ ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించడంతో మెగా ఫ్యామిలీలో సందడి నెలకొంది. ఫిల్మ్ నగర్లోని అపోలో ఆసుపత్రిలో మెగా వారసులరాలు జన్మించడంతో రామ్ చరణ్ ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఉపాసనతో పాటు..బిడ్డను చూసేందుకు మెగా ఫ్యామిలీ అపోలో ఆసుపత్రికి చేరుకుంటోంది. ఇందులో భాగంగా అల్లు అర్జున్ కుటుంబం అపోలో ఆసుపత్రికి చేరుకుని రామ్ చరణ్ ఉపాసనకు శుభాకాంక్షలు తెలిపారు. తన భార్య స్నేహరెడ్డితో కలిసి అపోలో ఆసుపత్రికి వచ్చిన అల్లు అర్జున్ కోడలను చూసి మురిసిపోయారు. ఎత్తుకుని ముద్దాడారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. జూన్ 20వ తేదీ మంగళవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఉపాసన ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు అపోలో ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఈ మేరకు ఓ ప్రకటనను రిలీజ్ చేశాయి. దీంతో మెగాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు రామ్ చరణ్, ఉపాసనలకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.