
ముద్దు ముద్దు మాటలు, అల్లరి చేష్టలతో ఇప్పటికే సోషల్ మీడియాలో బోలెడంతమంది ఫ్యాన్స్‌ని సంపాదించుకుంది అల్లు అర్జున్ కూతురు అర్హ. త్వరలో వెండితెరపై కూడా మెరవనుంది. సమంత లీడ్ రోల్‌లో గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ‘శాకుంతలమ్’లో నటించబోతోంది. శకుంతలగా సమంత, దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటిస్తున్న ఈ చిత్రంలో.. యువరాజు భరత్‌గా అర్హ కనిపించబోతోంది. ‘అల్లు ఫ్యామిలీ నుంచి నాలుగో తరం కూడా ఇండస్ట్రీకి రావడం గర్వకారణం. నా కూతురికి ఇంత మంచి డెబ్యూ ఇస్తున్న గుణశేఖర్, నీలిమలకు థ్యాంక్స్. సమంతతో నేను నటించాను. ఇప్పుడు నా కూతురు కూడా నటిస్తుండటం హ్యాపీ’ అంటూ బన్నీ కూడా హ్యాపీగా ఫీలవుతున్నాడు.