‘ఊర్వశివో.. రాక్షసివో’ టీజర్ రిలీజ్

‘ఊర్వశివో.. రాక్షసివో’ టీజర్ రిలీజ్

అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా ‘ఊర్వశివో.. రాక్షసివో’ అనే మూవీ రూపొందుతోంది. రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నాడు.  అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, ఎమ్.విజయ్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీని నవంబర్ 4న రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేస్తూ నిన్న టీజర్‌‌‌‌ను వదిలారు. ‘కొన్ని విషయాలు మనం ఎంత ట్రై చేసినా జరగవు. ఒక్కోసారి అనుకోకుండా జరిగిపోతాయి’ అంటూ శిరీష్ చెప్పిన డైలాగ్‌‌తో స్టార్ట్ అయిన టీజర్ ఆద్యంతం రొమాంటిక్‌‌గా సాగింది. శ్రీకుమార్‌‌‌‌గా శిరీష్, సింధుగా అను కనిపిస్తున్నారు. ఇద్దరూ సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తుంటారు. ఇంట్లో అమాయకంగా ఉండే శిరీష్, బయట మాత్రం అనుతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాడు.

అయితే బాగా దగ్గరయ్యాక నువ్వు నా ఫ్రెండ్‌‌వే తప్ప నీపై ప్రేమ లేదంటుంది అను. దాంతో షాకైన శిరీష్ ఆ తర్వాత ఏం చేశాడు, అను మనసు ఎలా మార్చాడనేది మిగతా కథ. వెన్నెల కిశోర్, సునీల్‌‌ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. అచ్చు రాజమణి, అనూప్ రూబెన్స్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.