ఈసారి రొమాంటిక్ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌తో వస్తున్న అల్లు శిరీష్

ఈసారి రొమాంటిక్ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌తో వస్తున్న అల్లు శిరీష్

ఇప్పటి వరకు రకరకాల కాన్సెప్టులు ట్రై చేసిన అల్లు శిరీష్.. ఈసారి ఒక రొమాంటిక్ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌తో వస్తున్నాడు. రాకేష్‌‌ శశి దర్శకత్వంలో ‘ఊర్వశివో రాక్షసివో’ అనే మూవీ చేస్తున్నాడు శిరీష్. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌‌గా నటిస్తోంది. జీఏ2 పిక్చర్స్ నిర్మిస్తోంది. నవంబర్ 4న సినిమా విడుదల కానుండటంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. నిన్న మొదటి పాటను వదిలారు. ‘ధీంతననా ధీంతననా ఈ చూపుల దాడి.. చేసిందే చేసిందే ఈ గారడీ’ అంటూ సాగే ఈ పాటని అచ్చు రాజమణి ట్యూన్ చేశాడు.

‘నీ అడుగుల వెంట నే గురుతై ఉంటా.. నీ పాదమే దాటు ప్రతి చోటునా.. నీ పెదవులు తాకే నా పేరును వింటా.. ఆ స్పర్శకే పొంగిపోతానట’ అంటూ సింపుల్‌‌ అండ్ క్యాచీ లిరిక్స్ రాశాడు పూర్ణాచారి. సిద్ శ్రీరామ్ తన సింగింగ్‌‌ స్టైల్‌‌తో పాటకి ప్రత్యేకతని తీసుకొచ్చాడు.