చైల్డ్ ఆర్టిస్ట్‌గా మొదలుపెట్టిన చాలామంది యాక్టర్స్ చిన్నప్పుడు చూసినంత స్టార్డమ్ తిరిగి పెద్దయ్యాక యాక్టర్‌గా తెచ్చుకోవాలంటే అంత ఈజీ కాదు. సరైన కథ, సరైన టైం రావాలి అని చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. కానీ, కొన్నిసార్లు మనకు కావాల్సింది అనుకున్నప్పుడు రాదు. ఎప్పుడైతే మనముందున్న విషయాలతో పాటు మనకేం కావాలో అర్థం చేసుకుంటామో అప్పుడు వస్తుంది. ఆ రోజు నిజమైన సక్సెస్ చూస్తాం. కాబట్టి అనుకున్నది సాధించేవరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. పాజిటివ్ మైండ్‌సెట్‌తో ముందుకు సాగాలి. అప్పుడప్పుడు రిస్క్‌లు కూడా తీసుకోవాలి. అప్పుడే లైఫ్ మనం అనుకున్నట్టు లీడ్ చేయగలం అంటున్నాడు నటుడు కునాల్ ఖేము (Kunal Khemu). సింగిల్ పేరెంట్ పాత్రలో కామెడీ పంచుతూ ఓ మంచి కథతో ఓటీటీలోకి వచ్చేశాడు. ఈ సందర్భంగా కునాల్ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విశేషాలు ఇవి.
కునాల్ ఖేము.. యాక్టర్, డైరెక్టర్, సింగర్, కంపోజర్ కూడా. శ్రీనగర్‌కు చెందిన కశ్మీరి పండిట్స్ కుటుంబంలో పుట్టాడు కునాల్. తల్లిదండ్రులు జ్యోతి, రవి ఇద్దరూ నటులే. రవి వాళ్ల నాన్న మోతీలాల్, కశ్మీరి ప్లేరైటర్. 1982లో సాహిత్య అకాడమీ అవార్డ్ పొందారు. ఆయన పద్మశ్రీ అవార్డ్ గ్రహీత. ఈ క్రమంలోనే కునాల్, నటి సోహా అలీఖాన్ 2009 వరకు రిలేషన్షిప్లో ఉన్నారు. 2015లో పెండ్లి చేసుకున్నారు. 2017లో ఈ కపుల్‌కి ఒక పాప పుట్టింది. తనపేరు ఇనాయ నౌమీ ఖేము.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా..
కశ్మీర్లో పరిస్థితుల కారణంగా కునాల్ చదువు కోసం కొన్నాళ్లు తనని అక్కడే ఉంచి, పేరెంట్స్ మాత్రం జమ్మూకి షిఫ్ట్ అయ్యారు. ఆ తర్వాత ముంబైకి వచ్చి అక్కడే స్థిరపడ్డారు. ఏడేండ్ల వయసులో కునాల్ కూడా ముంబైకి వచ్చాడు. కానీ అప్పటికి తను అక్కడికి ఎందుకొచ్చాడో తెలియని వయసు అది. హాలీడేస్ కోసం మాత్రమే వచ్చాడని అనుకునేవాడినని ఓ సందర్భంలో చెప్పాడు కునాల్. స్కూల్ చదువు కూడా అక్కడే పూర్తి చేశాడు. నార్సీ మోంజీ కాలేజీ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్‌లో చదివాడు.
కునాల్‌కి సినిమాల్లో ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉండడంతో చిన్నప్పటి నుంచే యాక్టింగ్ అబ్బింది. దూరదర్శన్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. ఆ తర్వాత సర్, రాజా హిందూస్థానీ, భాయ్, హమ్ హై రహీ ప్యార్ కె, దుష్మన్ వంటివాటిల్లో నటించాడు. పదేండ్లపాటు చైల్డ్ ఆర్టిస్ట్‌గా బిజీగా యాక్టింగ్ చేసిన కునాల్ అప్పట్లో అవార్డులు కూడా గెలుచుకుని స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్నాడు.
లీడ్ రోల్స్‌లో..
2005లో కాల్యుగ్ అనే సినిమాతో లీడ్ యాక్టర్‌గా కనిపించాడు. ట్రాఫిక్ సిగ్నల్, ధోల్, సూపర్ స్టార్ వంటి సినిమాల్లో నటించాడు. కానీ, తనకు సరైన బ్రేక్ రాకపోవడంతో కెరీర్లో వెనకబడ్డాడు. రావాల్సిన సక్సెస్ ఆశించినంత స్థాయిలో రాలేదనే కసితో ఎప్పటికప్పుడు తనని తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశాడు.
అయితే 2010లో గోల్ మాల్ 3 సినిమాతో తిరిగి తన ఉనికిని చాటుకున్నాడు. ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నాడు. 2013లో గో గోవా గాన్ సినిమాలో నటించడంతోపాటు డైలాగ్ రైటర్‌గానూ పనిచేశాడు. ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత లీడ్ రోల్స్, గెస్ట్ రోల్స్ ఇలా అన్నీ చేశాడు. హనుమాన్ : డా డాండార్ అనే యానిమేషన్ సినిమాలో ఇంద్రుడి పాత్రకు వాయిస్ ఓవర్ ఇచ్చాడు.
సింగిల్ పేరెంట్‌గా..
ప్రస్తుతం సింగిల్ పాపా సిరీస్‌తో ఆడియెన్స్ ముందుకి వచ్చాడు. ఈ సినిమా కేవలం ఒక కుటుంబం గురించి మాత్రమే కాదు.. ఇది సింగిల్ పేరెంట్ జర్నీ. ఒక బిడ్డను దత్తత తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి జీవితంలో జరిగే పరిణామాలు ఈ సిరీస్‌లో కనిపిస్తాయి. ‘ఈ కథలో ఫ్యామిలీ డ్రామాతోపాటు చాలా ఫన్ ఉంటుంది. ‘‘నవ్విస్తూనే ఒక కథ చెప్పడం అంత ఈజీ కాదు. ప్రతి ఒక్కరిలోనూ పిల్లలు ఉంటారు. మనలోని ఆ పిల్లల మనస్తత్వం కొన్నిసార్లు బయటకొస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు చాలాసార్లు ఏంటిది చిన్న పిల్లాడిలా అంటుంటారు. కానీ, అందులో తప్పేమీలేదు.
నిజానికి ఎవరైనా ఆ మాట అంటే దాన్ని గౌరవంగా భావించాలి. నా విషయానికొస్తే నాలోని చిన్నపిల్లాడు నన్ను కెరీర్లో ముందుకు తీసుకెళ్లాడు. కొత్త పనులు చేసేందుకు, రిస్క్‌లు తీసుకునే ధైర్యం ఇచ్చాడు. నేను అనుకున్న జీవితాన్ని జీవించేలా చేశాడు” అని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు కునాల్.
బిగ్గెస్ట్ బ్రేక్..
హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు కునాల్. చిన్నప్పుడు తను కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కోసారి ఏడాదికి రెండు, మూడు రిలీజ్లు తనవే ఉంటాయి. క్యారెక్టర్ ఏదైనా ప్రతి సంవత్సరం తను నటించిన ఒక్క ప్రాజెక్ట్ అయినా ఉండాల్సిందే. అంతలా సినిమా మీద ప్యాషన్‌తో వర్క్ చేస్తుంటాడు.
ఇలా వరుసగా సినిమాల్లో నటిస్తోన్న కునాల్ 2024లో ‘మడగావ్ ఎక్స్‌ప్రెస్’ సినిమాతో డైరెక్టర్, రైటర్‌గా మారాడు. ఈ సినిమా హిట్ కావడమే కాకుండా బెస్ట్ డెబ్యూ డైరెక్టర్‌గా ఐఫా, 70వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్‌లను అందుకుంది. అలా బ్రేకుల్లేకుండా నడుస్తోన్న కెరీర్లో కొత్త మలుపు తీసుకొచ్చింది ఈ సినిమా. అంతేకాదు.. ఈ మధ్యలో 2019 –2022లో అభయ్ అనే వెబ్ సిరీస్‌లో నటించాడు. తర్వాత పాప్ కౌన్? అనే సిరీస్‌లోనూ చేశాడు.
I got this covered 😉
— kunal kemmu (@kunalkemmu) June 10, 2021
Magazine: @MagazineIcraze
Editor: #SupriyaKhemani
Cover design: #iccdesigns
Media Director: @MediaRaindrop
Outfit @DRVVofficial
Styled by @kareenparwani
Assisted by #Anuja #NiiraliGala
Photographed by @anurag_kabbur
Hair artist by #Tanik pic.twitter.com/Y8KhFZM06M
