Strenthy Food: బాదం పప్పు తింటే బలమే కాదు.. బరువు కూడా తగ్గుతారు..!

Strenthy Food:  బాదం పప్పు తింటే బలమే కాదు.. బరువు కూడా తగ్గుతారు..!

బాదం పప్పు బలమే..డ్రై ఫ్రూట్స్ తింటే చాలా మంచిది. వాటితో ఎన్నో లాభాలున్నాయి.
ఇలాంటి మాటలు వింటూనే ఉంటాం.అవును అది నిజమే. బాదం పప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే బాదం పాలు కూడా ఆరోగ్యా నికి మంచి ఔషధంగా పని చేస్తాయి. ఇందులోని విటమిన్లు, ప్రొటీన్లు, మినరల్స్ వంటి ఖనిజాలు శరీరానికి కావలసిన పోషక విలువలను అంది స్తాయి.

  • వ్యాయామం ఎక్కువగా చేసేవాళ్లు తరచూ బాదం పాలను తాగితే.. కండరాల నిర్మాణం సరిగ్గా ఉంటుంది. అంతేకాకుండా శరీ రానికి కావలసిన ఎనర్జీ వస్తుంది.
  • బాదం పాలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, క్యాల్షియం, పాస్ఫరస్ వంటివి పుష్కలంగా ఉంటాయి. అవి చెడు కొలెస్ట్రాల్​ ను తగ్గిస్తాయి.
  • హైబీపీతో బాధపడేవాళ్లకి కళ్లు తిరగడం, వాంతులు, తలనొప్పి వంటి సమస్యలు అధికంగా వస్తాయి. ఏ ఆహారం తిన్నా త్వరగా అరగదు. అందుకు రోజూ పచ్చి బాదం పప్పులను సేవిస్తే బీపీ అదుపులో ఉంటుంది.
  •  డయాబెటిస్ వ్యాధి ఉన్నవాళ్లు బాదం పాలు తీసుకోవడం తప్పనిసరి. ఈ పాలు తాగడం వల్ల శరీరానికి ఎలాంటి హాని ఉండదు. ఆకలి నియంత్రణకు సహాయపడుతుంది.
  •  రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుతాయి ఈ బాదం పాలు.  తద్వారా అధిక బరువు తగ్గే అవకాశం ఉంది.