ఏం మనిషివి రా నువ్వు.. కాళ్లతో తొక్కిన ఆలూతో.. టిక్కీ చేసి అమ్ముతున్నాడు..!

ఏం మనిషివి రా నువ్వు.. కాళ్లతో తొక్కిన ఆలూతో.. టిక్కీ చేసి అమ్ముతున్నాడు..!

బయట ఫుడ్ తినాలంటేనే భయపడే రోజులివి. శుచి.. శుభ్రత ఉండదని.. వీలైనంత వరకూ ఇంట్లోనే వండుకుని తింటున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. కానీ.. కొందరికి బయట తినక తప్పని పరిస్థితులుంటాయి. అలాంటి వాళ్లు ఉదయం బ్రేక్ ఫాస్ట్ మొదలుకుని.. సాయంత్రం స్నాక్స్ వరకూ బయటే తింటుంటారు. అలాంటి వాళ్లకు ఈ వీడియో చూస్తే కడుపులో తిప్పడం ఖాయం.

ఇంటర్నెట్లో ఇప్పుడు ఒక వీడియో నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన వాళ్లందరికీ ఇదెక్కడి ఘోరం అని అనిపించక మానదు. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. యూపీలోని ఘజియాబాద్లో జరిగిన ఘటనగా చెబుతున్న ఈ వీడియోలో.. బంగాళదుంపలు అదేనండీ ఆలు గడ్డలను పాత్రలోని నీళ్లలో వేసి ఒక వ్యక్తి కాళ్లతో తొక్కుతూ ఉన్నాడు.

►ALSO READ | ఈ గ్యాస్ కష్టాల్లోనూ.. ఫ్రీ సిలిండర్లు ఇస్తామంటున్న ప్రభుత్వం ఇదే..!

శుభ్రం చేస్తున్నామనే పేరుతో మరింత గబ్బు పట్టిస్తున్నాడు. కాళ్లతో తొక్కిన ఈ ఆలుగడ్డలతోనే టిక్కీ చేసి అమ్ముతున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. పైగా వైరల్ అయిన ఈ వీడియోలో ఆ వ్యక్తి కాళ్లకు చెప్పులేసుకుని మరీ బంగాళదుంపలను తొక్కుతున్నాడు. 

ఘజియాబాద్‌లోని డీఎల్‌ఎఫ్ అంకుర్ విహార్‌లోని ఒక ఫుడ్ స్టాల్లో కనిపించిన దృశ్యం ఇది. పక్కనే మురికి కాలువ కూడా ఉంది. ఈ వీడియోను ఒక మహిళ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఏరియాలోనే ఈ ఫుడ్ స్టాల్ ఒక ఫేమస్ ఆలూ టిక్కీ స్టాల్ అని.. అలాంటి చోట ఇంత అపరిశుభ్రంగా ఆలు గడ్డలను కాళ్లతో తొక్కుతూ కడగటం సిగ్గుచేటని వీడియో పోస్ట్ చేసిన మహిళ పోస్ట్ చేసింది.