నక్కలబండ తాండ వద్ద ఆల్ఫ్రాజోలం పట్టివేత... ముగ్గురు అరెస్ట్

నక్కలబండ తాండ వద్ద ఆల్ఫ్రాజోలం పట్టివేత... ముగ్గురు అరెస్ట్

జడ్చర్ల , వెలుగు: జడ్చర్ల-– మహబూబ్‌‌నగర్ నేషనల్ హైవే 167పై ఎక్సైజ్ పోలీసులు జరిపిన తనిఖీల్లో ఆల్ఫ్రాజోలం  అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌‌కు తరలించినట్లు  ఎక్సైజ్ ఎస్‌‌ఐ కార్తిక్ తెలిపారు.  గురువారం రాత్రి  మండలంలోని నక్కలబండ తాండ వద్ద నేషనల్ హైవే 167పై జడ్చర్ల – మహబూబ్‌‌నగర్ రోడ్డుపై తనిఖీలు చేయగా.. కోయిలకొండ మండలం పెద్దతాండకు చెందిన కొండ్యానాయక్  బైక్​పై ఆల్ఫ్రాజోలం తరలిస్తూ పట్టుబడ్డాడు.  

అతన్ని విచారించగా వచ్చిన సమాచారంతో శుక్రవారం దమ్మాయిగూడెంకు చెందిన రాంసాగర్, నాగరాజులను హైదరాబాద్‌‌లోని మౌలాలీ  వద్ద అదుపులోకి తీసుకున్నారు.   కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.