హైదరాబాద్ సిటీ, వెలుగు: బదిలీ ఉత్తర్వులను పాటించకుండా విధులకు హాజరుకాని డిప్యూటీ కమిషనర్ వి.శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్ఎంసీ పునర్విభజనలో భాగంగా అల్వాల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న శ్రీనివాస్ రెడ్డిని కవాడిగూడ సర్కిల్‌కు బదిలీ చేస్తూ తక్షణమే డ్యూటీలో చేరాలని రెండు రోజుల క్రితం ఆర్డర్స్ఇచ్చారు. అయితే, శ్రీనివాస్ రెడ్డి ఈ ఆదేశాలను పట్టించుకోలేదు. దీంతో ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కమిషనర్ కర్ణన్శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
శ్రీనివాస్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ లా డిపార్ట్‌మెంట్ నుంచి డిప్యూటేషన్‌పై వచ్చి జీహెచ్ఎంసీ లో డీసీగా పని చేస్తున్నారు. విధులకు హాజరుకాకపోవడంపై విచారణ చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే ఆయన అల్వాల్ సర్కిల్‌లో పనిచేసిన టైంలో ఖాళీ స్థలాలకు పెద్ద సంఖ్యలో ఇంటి నెంబర్లు మంజూరు చేశారనే ఆరోపణలున్నాయి. ఇదే వ్యవహరంపై విజిలెన్స్ విచారణను ఎదుర్కొన్నట్లు తెలిసింది.
