అల్వాల్ ‘టిమ్స్’లో 19 రకాల వైద్యసేవలు ..కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్

అల్వాల్ ‘టిమ్స్’లో 19 రకాల వైద్యసేవలు ..కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్

పద్మారావునగర్, వెలుగు: అల్వాల్ టిమ్స్ హాస్పిటల్ నిర్మాణ పనులను బుధవారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్​హెల్త్, ఆర్​అండ్​బీ డిపార్ట్​మెంట్ అధికారులతో కలిసి పరిశీలించారు. హాస్పిటల్​కు వచ్చే వారికి ఎక్కడెక్కడ ఏఏ సేవలు లభిస్తాయో తెలిసేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. 

వెయ్యి పడకలు గల ఈ హాస్పిటల్​లో న్యూరాలజీ, ట్రామాకేర్, క్యాన్సర్, ఆర్థోపెడిక్ మొదలగు 19 విభాగాల వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని, 23 విభాగాలతో టీచింగ్ హాస్పిటల్ ఏర్పాటు కాబోతుందని చెప్పారు. మెరుగైన  వసతులతో అతి తొందరలోనే నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభోత్సవం చేసి పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే తెలిపారు.