అమలను మోసం చేసింది ఎవరు?

అమలను మోసం చేసింది ఎవరు?

సౌత్​ ఇండస్ట్రీలో తనకంటూ సొంత గుర్తింపును తెచ్చుకున్న హీరోయిన్​ అమలా పాల్(Amala Paul)​. బయటకు ఎంతో బోల్డ్​గా కనిపించే ఈ నటి ఓ టైంలో మానసిక వేదనను ఎదుర్కున్నట్టు తెలిపింది. అందుకు కొందరు వ్యక్తులు కారణమయ్యారని వివరించింది. 

మైనా(ప్రేమఖైదీ) సినిమా తర్వాత మానసికంగా చాలా కుంగిపోయాను. కొందరి వల్ల నేను మోసపోయాను. నన్ను ఆ పరిస్థితుల్లో చూసి మా అమ్మ చాలా బాధపడింది. రెండేళ్ల కరోనా కాలాన్ని ఆ ఆలోచనలతోనే గడిపేశాను. జీవితంలో నన్ను గైడ్​ చేసే సరైన వ్యక్తి ఉండుంటే నా జీవితం మరోలా ఉండేదేమో..అంటూ అమలా పాల్​ చేసిన కామెంట్స్​ వైరల్​ అవుతున్నాయి.

తమిళ దర్శకుడు విజయ్​ను లవ్​ మ్యారేజ్​ చేసుకున్న అమల.. కొద్దిరోజులకే విడిపోయింది. ఆ తర్వాత ఓ కోలీవుడ్​ హీరోతో ప్రేమలో ఉందంటూ రూమర్స్​ కూడా వినిపించాయి. ఇప్పుడు ఈ అమ్మడి చేతిలో నాలుగుకుపైగా భారీ సినిమాలు ఉన్నాయి.