అమర రాజా లాభం రూ. 164.8 కోట్లు

అమర రాజా లాభం రూ. 164.8 కోట్లు

న్యూఢిల్లీ: అమర రాజా ఎనర్జీ అండ్​ మొబిలిటీ లిమిటెడ్ నికర లాభం (కన్సాలిడేటెడ్​)  అధిక ఖర్చుల కారణంగా 2025 జూన్ 30తో ముగిసిన మొదటి క్వార్టర్​లో 33 శాతం తగ్గి రూ. 164.8 కోట్లకు పడిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో కంపెనీ లాభం (పీఏటీ) రూ. 249.12 కోట్లుగా ఉంది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 3,401.08 కోట్లుగా ఉంది. గత సంవత్సరం ఇదే కాలంలో రూ. 3,263.05 కోట్లు వచ్చాయి. 

మొత్తం ఖర్చులు రూ. 3,190.66 కోట్లుగా ఉన్నాయి. గత సంవత్సరం ఇదే కాలంలో రూ. 2,957.93 కోట్లుగా ఉన్నాయి. లెడ్ యాసిడ్ బ్యాటరీలు, అనుబంధ ఉత్పత్తుల విభాగం ఆదాయం రూ. 3,279.79 కోట్లుగా ఉంది. కొత్త ఇంధన వ్యాపారం ఆదాయం మొదటి క్వార్టర్​లో రూ. 121.29 కోట్లుగా నమోదైంది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో రూ. 125.75 కోట్లు ఉంది.