తెలంగాణ పెట్టుబడులకు అనువైన ప్రాంతం: గల్లా జయదేవ్ 

తెలంగాణ పెట్టుబడులకు అనువైన ప్రాంతం: గల్లా జయదేవ్ 

తెలంగాణ రాష్ట్రం ఎలక్ట్రికల్ వెహికల్ హబ్ గా మారుతుందని అమరరాజా బ్యాటరీస్ ఛైర్మన్ గల్లా జయదేవ్ అన్నారు. రాబోయే 10ఏండ్లలో రూ.9,500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని చెప్పారు. 
ఎనర్జీ అండ్ మొబిలిటీ'కి కీలకంగా ఉంటున్న అమర రాజా బ్యాటరీస్ అమరరాజా గిగా కారిడార్ కోసం తెలంగాణ రాష్ట్రాన్ని  ఎంచుకున్నామని చెప్పారు. 

ఇప్పటికే  అధునాతన రీసెర్చ్ అండ్ ఇన్నో వేషన్ సెంటర్ ను అమరరాజా ఈ హబ్ పేరిట హైదరాబాద్ లో ఉందన్నారు. ఇప్పుడు ఈ కేంద్రం మెటీరియల్ రీసెర్చ్, ప్రొటొటైపింగ్, ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ అనాలిసిస్, గ్రూప్ ఆఫ్ కాన్సెప్ట్ డిమాన్ స్ట్రేషన్ కోసం అధునాతన లేబొరేటరీలు, టెస్టింగ్ మౌలిక వసతులను కలిగిఉంటుందన్నారు. అదే విధంగా ఎనర్జీ, మొబిలిటీ రంగాల్లోని ఇతర సంస్థలకు పలు రకాల సదుపాయాలను అందిస్తుందన్నారు. స్దానికులకే ఉద్యోగ అవకాశాలు  కల్పిస్తామని చెప్పారు.