ఇంటర్నేషనల్ కోర్టుకు చేరిన అమరావతి లొళ్లి

ఇంటర్నేషనల్ కోర్టుకు చేరిన అమరావతి లొళ్లి

ఇంటర్నేషనల్ కోర్టులో ‘అమరావతి’ పిటిషన్
మానవ హక్కుల ఉల్లంఘనపై ఎన్నారైల ఫిర్యాదు

అమరావతి, వెలుగు: ఏపీ రాజధాని అమరావతి ఉద్యమంలో మహిళలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంపై ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌లో పిటిషన్ దాఖలైంది. మహిళలపై పోలీసులు లాఠీచార్జ్ చేసి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని అమరావతి జేఏసీ ఎన్నారైల బృందం ఈ పిటిషన్ వేసింది. నెదర్లాండ్స్‌లోని ది హేగ్ లో ఉన్న ఇంటర్నేషనల్ కోర్టు పిటిషన్‌ను విచారణకు స్వీకరించినట్లు అమరావతి జేఏసీ ఎన్నారై బృందం తెలిపింది. ప్రాసిక్యూటర్ అక్నాలెడ్జ్‌మెంట్ కూడా ఇచ్చినట్లు పిటిషనర్ శ్రీనివాస్ కావేటి అన్నారు. అమరావతి మహిళలపై ఏపీ పోలీసులు అక్కడి హైకోర్టుకు తప్పుడు నివేదికలు ఇచ్చారని ఆరోపించారు. మహిళల పాదయాత్రను మాత్రమే అడ్డుకున్నామని పోలీసులు చెబుతున్నా.. మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లు వీడియో ఆధారాలను ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌కు అందించినట్లు చెప్పారు. జెనీవాలోని యునైటెడ్ నేషన్స్ మానవహక్కుల సంఘానికి కూడా త్వరలో ఫిర్యాదు చేస్తామన్నారు.