డిగ్రీతో SBI లో ప్రొహిబిషనరీ ఆఫీసర్స్ ఉద్యోగాలు..లాస్ట్ డేట్ జూలై14

డిగ్రీతో SBI లో ప్రొహిబిషనరీ ఆఫీసర్స్ ఉద్యోగాలు..లాస్ట్ డేట్ జూలై14

నిరుద్యోగులకు శుభవార్త. ముఖ్యంగా బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు తీపి కబురు.  డిగ్రీతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ప్రొబేషనరీ ఆఫీసర్స్ (PO) పోస్టుల భర్తీకి 2025 నోటిఫికేషన్ విడుదల అయింది. 

నోటిఫికేషన్ విడుదల తేదీ: జూన్ 24,2025 
దరఖాస్తు ప్రారంభ తేదీ: జూన్ 24,2025 
దరఖాస్తు చివరి తేదీ: జూలై 14,2025 
మొత్తం ఖాళీలు: రెగ్యులర్,బ్యాక్‌లాగ్ కలిపి 541ఖాళీలు
పరీక్ష విధానం: ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్/గ్రూప్ ఎక్సర్సైజ్/ఇంటర్వ్యూ.

విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ (డిగ్రీ) ఉత్తీర్ణులై ఉండాలి.
డిగ్రీ చివరి సంవత్సరం లేదా చివరి సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మెడికల్, ఇంజినీరింగ్, చార్టర్డ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్ వంటి డిగ్రీలు ఉన్నవారు కూడా అర్హులే.

వయోపరిమితి: 2025 ఏప్రిల్ 01 నాటికి 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
రిజర్వేషన్ కేటగిరీల (SC/ST, OBC, PWD) అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ:ప్రిలిమినరీ పరీక్ష (Phase I): 100 మార్కులకు ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ (40 ప్రశ్నలు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (30 ప్రశ్నలు), రీజనింగ్ ఎబిలిటీ (30 ప్రశ్నలు) ఉంటాయి. ఇది అర్హత పరీక్ష మాత్రమే.

మెయిన్ పరీక్ష (Phase II): 250 మార్కులకు ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ (200 మార్కులు) ,డిస్క్రిప్టివ్ టెస్ట్ (50 మార్కులు) 
ఆబ్జెక్టివ్ టెస్ట్‌లో రీజనింగ్ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్, డేటా అనాలిసిస్ & ఇంటర్‌ప్రిటేషన్, జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ విభాగాలు ఉంటాయి. డిస్క్రిప్టివ్ టెస్ట్‌లో లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్ ఉంటాయి.

సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్ & ఇంటర్వ్యూ (Phase III):సైకోమెట్రిక్ టెస్ట్: ఇది కేవలం ప్రొఫైలింగ్ కోసం మాత్రమే, తుది స్కోర్‌లో లెక్కించబడదు.

గ్రూప్ ఎక్సర్సైజ్: 20 మార్కులు
ఇంటర్వ్యూ: 30 మార్కులు (మొత్తం 50 మార్కులకు).
తుది ఎంపిక మెయిన్ పరీక్ష (75% వెయిటేజ్),  గ్రూప్ ఎక్సర్సైజ్ & ఇంటర్వ్యూ 25% వెయిటేజ్ లో సాధించిన మార్కుల ఆధారంగా ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష మార్కులు తుది ఎంపికకు పరిగణనలోకి తీసుకోబడవు.

దరఖాస్తు విధానం:

  • ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ sbi.co.in/web/careers లో దరఖాస్తు చేసుకోవాలి.
  • మరిన్ని వివరాల కోసం, మీరు తప్పనిసరిగా ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదలైన పూర్తి నోటిఫికేషన్‌ను చూడొచ్చు.