గంటలోనే మారిన వెదర్.. హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు.. ఈ ఏరియాల వాళ్లు జాగ్రత్త !

గంటలోనే మారిన వెదర్.. హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు.. ఈ ఏరియాల వాళ్లు జాగ్రత్త !

వానా కాలమా.. ఎండా కాలమా అన్న తేడా లేకుండా ఇవాళ్టి (జూన్ 24) వరకు ఎండలు దంచికొట్టాయి. ముందస్తుగా వచ్చిన రుతుపవనాలు ఎగిరిపోవడంతో వర్షాలు సెలవు తీసుకుని మళ్లీ వేసవిని తలపిస్తూ వచ్చింది వెదర్. అయితే ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దట్టమైన మేఘాలతో హైదరాబాద్ నగరమంతా ఏ క్షణానైనా వర్షం కురవవచ్చు అనేలా కనిపించింది.

అనుకున్నట్లుగానే ఈదురుగాలులతో మొదలైన చిరుజల్లు.. మోస్తరు నుంచి భారీ వర్షాలుగా మారిపోయాయి. దాదాపు హైదరాబాద్ నగరం అంతా వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. 

పటాన్ చెరు, అమీన్ పూర్, బీరంగూడ, మియాపూర్, BHEL, చందానగర్, ప్రగతి నగర్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, అల్వార్ మొదలైన ఏరియాలో చిరు జల్లులు కురుస్తున్నాయి. మరోవైపు బొల్లారం, యాప్రాల్, హకీంపేట్, మల్కాజ్ గిరి, తిరుమలగిరి, కాప్రాన్ ఏరియాల్లో వాన మొదలైంది. 

పశ్చిమాన గచ్చిబౌలి, గోల్కొండ, మణికొండ, అత్తాపూర్, రాజేంద్ర నగర్, చంద్రాయణగుట్ట, చార్మినార్  పరిసర ప్రంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇక బంజరాహిల్స్, జూబ్లీహిల్స్, కమాన్ ఏరియాల్లోనూ వర్షం కురుస్తోంది. 

మరో రెండు గంటల్లో వర్షాలు మరింతగా పెరిగే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బయటకు వెళ్లే వారు కచ్చితంగా గొడుగు వెంట తీసుకెళ్లాల్సిందిగా సూచిస్తున్నారు. పైన పేర్కొన్న ఏరియావైపు వెళ్తున్న వాహనదారులు.. వాన నిలిచే వరకు ఎక్కడైనా తలదాచుకోవాలిని సూచించారు. వర్షా నిలిచాకే వెళ్లాలని హెచ్చరించారు అధికారులు.