
ముంబై: టీమిండియా స్టార్ క్రికెటర్ హార్ధిక్ పాండ్యాతో డేటింగ్ పుకార్లపై హాట్ బ్యూటీ ఈషా గుప్తా ఎట్టకేలకు మౌనం వీడింది. హార్ధిక్ పాండ్యాతో ఉన్న రిలేషనేంటో కుండబద్దలు కొట్టింది. ‘‘హార్ధిక్, నేను రెండు నెలల పాటు మాట్లాడుకున్నాం. ఒకటి రెండు సార్లు బయట కలిశాం. కానీ అది డేటింగ్ కాదు. మేం డేటింగ్ దశకు చేరుకోకముందే మా రిలేషన్ ముగిసింది. మా ఇద్దరి మధ్య రిలేషన్ ఎప్పుడూ అంత డీప్‌గా వెళ్లలేదు. ప్రస్తుతం పాండ్యాతో టచ్‌లో లేను’’ అని క్లారిటీ ఇచ్చింది. మేం ఇద్దరం డేటింగ్ చేసే అవకాశం ఉండేది కానీ కొన్ని పరిస్థితుల వల్ల అది జరగలేదు. ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతోందని.. ఆ విషయంలో ఎలాంటి బాధ లేదని చెప్పుకొచ్చింది ఈషా.
కాగా, బాలీవుడ్ హాట్ బ్యూటీ ఈషా గుప్తా, టీమిండియా స్టార్ క్రికెటర్ హార్ధిక పాండ్యా డేటింగ్ లో ఉన్నట్లు అప్పట్లో పెద్ద ఎత్తున పుకార్లు వినిపించాయి. వీరిద్దరూ కలిసి బయట కనిపించడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఏమైందో తెలియదు కానీ ఆ తర్వాత ఎవరి దారి వారు చూసుకున్నారు. ఈషా గుప్తా సినిమాల్లో బిజీ కాగా, పాండ్యా క్రికెట్ లో నిమగ్నమైపోయాడు. ఆ తర్వాత పాండ్యా సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి ఒక కుమారుడు కుడా ఉన్నాడు. వ్యక్తిగత కారణాలతో పాండ్యా, నటాషా విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు.