వరి రైతులకు గుడ్​న్యూస్.. పొలం వద్దే బియ్యం పట్టించుకోవచ్చు

వరి రైతులకు గుడ్​న్యూస్.. పొలం వద్దే బియ్యం పట్టించుకోవచ్చు
  •    టూ ఇన్ వన్ హార్వెస్టర్ తయారుచేసిన యువకుడు..

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు గ్రామానికి చెందిన అమరేందర్ వరి రైతులకు గుడ్​న్యూస్​ చెప్పాడు. ఇకనుంచి రైతులు ఎవరూ  రైస్ మిల్లులకు వెళ్లకుండా వరి కోసిన వెంటనే వాటిని బియ్యంగా మార్చేలా హార్వెస్టర్ లో మార్పులు చేశాడు. ఏడాదిగా దానిపైనే దృష్టిపెట్టిన అమరేందర్​ చివరకు టూ ఇన్ వన్ హార్వెస్టర్ తయారు చేశాడు.

దీని తయారీకి రూ.30 వేల వరకు ఖర్చయిందన్నాడు. వరి కోసిన వెంటనే వడ్ల నుంచి అక్కడే బియ్యాన్ని బయటికి తీయవచ్చన్నాడు. దీనివల్ల రైతులకు ఆటో, ట్రాక్టర్ కిరాయిలు, రైస్ మిల్లులకు వెళ్లే బాధ తప్పుతుందని చెప్పాడు.