తిరిగి ప్రారంభమైన అమర్​నాథ్​ యాత్ర..

తిరిగి ప్రారంభమైన అమర్​నాథ్​ యాత్ర..

ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల 3 రోజుల క్రితం బ్రేక్​ పడిన అమర్​నాథ్​ యాత్ర జులై 9 న మళ్లీ ప్రారంభమైంది. దీంతో ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతోంది. ఇవాళ మధ్యాహ్నం గరిష్ట సంఖ్యలో  ఆలయాన్ని దర్శించుకున్నారు.  జమ్ము కశ్మీర్​లో ఏర్పడ్డ ప్రతికూల పరిస్థితుల వల్ల అధికారులు యాత్రకు రావడం శ్రేయస్కరం కాదని చెప్పి.. మూడు రోజుల క్రితం జాతీయ రహదారులపై రాకపోకలను నిషిధించారు.  ప్రస్తుతానికి పహాల్గామ్​ మార్గంలో మాత్రమే రాకపోకలు మొదలయ్యాయి.  

బల్తాల్​లో వర్షాలు కురుస్తున్నందున  అక్కడ ఇంకా ప్రారంభించలేదు. యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి కేవలం 6 రోజుల పాటే భక్తుల దర్శనాలు జరిగాయి.  ఇప్పటి వరకు దాదాపు 67,566 మంది భక్తులు మంచు లింగాన్ని దర్శించుకున్నట్లు అధికారులు  చెప్పారు.  జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు అమర్​నాథ్​ యాత్ర కొనసాగనుంది. రక్షణ దళ సిబ్బంది కొండ చరియలు ఉన్న  ప్రాంతాల్లో రక్షణ చర్యలు పర్యవేక్షిస్తున్నారు.