అమెజాన్​లో ధరలు పెరిగే చాన్స్​

 అమెజాన్​లో ధరలు పెరిగే చాన్స్​
  •     పెరగనున్న సెల్లర్ల ఫీజు

న్యూఢిల్లీ :  ద్రవ్యోల్బణం,  వడ్డీ రేట్ల కారణంగా తమ సెల్లర్ల ఫీజులను సవరిస్తున్నట్లు ఈ–-కామర్స్ కంపెనీ అమెజాన్ శనివారం తెలిపింది. వచ్చే నెల ఏడో తేదీ  నుంచి అమెజాన్​ మార్కెట్‌‌ప్లేస్‌‌లో సెల్లర్ల రిఫరల్ ఫీజులు, క్లోజింగ్​ ఫీజులు, వెయిట్​ హ్యాండ్లింగ్​ఫీజులను పెంచుతున్నట్టు ప్రకటించింది. ఫలితంగా అమెజాన్​లోని కొందరు సెల్లర్ల ప్రొడక్టుల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, నిర్వహణ వ్యయాలు మొదలైన వివిధ స్థూల ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకొని ఫీజులను మార్చామని కంపెనీ తెలిపింది.

దుస్తులు, బెడ్‌‌షీట్‌‌లు, కుషన్ కవర్లు,  డిన్నర్‌‌వేర్ వంటి కేటగిరీలలో రెఫరల్ ఫీజులను తగ్గించామని పేర్కొంది.  చిమ్నీలు, ల్యాప్‌‌టాప్ స్లీవ్‌‌లు,  బ్యాగ్‌‌లు,  టైర్లు వంటి కేటగిరీలకు మాత్రం పెంచారు.  సగటు విక్రయ ధర రూ. 1,000 కంటే ఎక్కువ ఉన్నవారికి క్లోజింగ్​ ఫీజు రూ.3 పెరిగింది. ద్రవ్యోల్బణం పెరిగిన షిప్పింగ్ ఖర్చులకు అనుగుణంగా వెయిట్ హ్యాండ్లింగ్ ఫీజును రూ.2 పెంచినట్లు తెలిపింది.  ఇతర ఫీజు హెడ్‌‌లలో టెక్నాలజీ ఫీజులు,  పిక్ అండ్ ప్యాక్ ఫీజులు ఉంటాయి. జీరో ఫీ ఫుల్​ఫిల్​మెంట్​ పాలసీని రద్దు చేశారు.