భారీగా ఉద్యోగులను తొలగించిన అమెజాన్

భారీగా ఉద్యోగులను తొలగించిన అమెజాన్

న్యూఢిల్లీ: ఈ–కామర్స్ కంపెనీ అమెజాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా  లక్ష మంది ఉద్యోగులను తీసేసింది.  ఈ ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ముగిసిన క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కంపెనీ  తమ ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్లు, డిస్ట్రిబ్యూషన్ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలోని ఉద్యోగులను భారీగా తొలగించింది. అయినప్పటికీ కంపెనీ ఉద్యోగుల సంఖ్య (15 లక్షలు) మిగిలిన కంపెనీలతో పోలిస్తే ఇంకా ఎక్కువగానే ఉంది. కంపెనీలు తమ హైరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇంకోసారి పరిశీలించుకోవాలని, తాము కూడా కిందటేడాదితో పోలిస్తే ఈ సారి ఉద్యోగులను తీసుకోవడం తగ్గించేశామని అమెజాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రియాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓల్సవిస్కీ అన్నారు. కిందటేడాది నికరంగా 27 వేల మందిని ఉద్యోగులను తొలగించామని, ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  14 వేల మందిని నియమించుకున్నామని ఆయన అన్నారు. టెక్ కంపెనీ గూగుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా నియామకాలను తగ్గించేసింది. ఈ కంపెనీ మొత్తం ఉద్యోగులు ఈ ఏడాది మార్చి నాటికి 1.64 లక్షలుగా ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు పెరగడంతో ఇండియన్ స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఈ ఏడాది15 వేల మందికి  పైగా ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే.