వర్క్ ఫ్రం హోం ఆప్షన్ గడువు పెంచిన అమెజాన్

వర్క్ ఫ్రం హోం ఆప్షన్ గడువు పెంచిన అమెజాన్

కరోనావైరస్ విజృంభిస్తోండటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులకు ప్రముఖ ఆన్‌లైన్ దిగ్గజ కంపెనీ అమెజాన్ వర్క్ ఫ్రం హోమ్ ఆఫరిచ్చింది. గతంలో జనవరి 2021 వరకు ఈ ఆప్షన్ ఇచ్చింది. అయితే తాజా పరిస్థితుల దృష్ట్యా ఆ ఆప్షన్‌‌ను జూన్ 30, 2021 వరకు పొడిగిస్తూ ఉద్యోగులకు మెయిల్ చేసింది. ‘ఇంటి నుంచి సమర్థవంతంగా పనిచేయగలిగే ఉద్యోగులు దీనిని స్వాగతించారు’ అని అమెజాన్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

అమెరికాలోని అమెజాన్ ఉద్యోగులు 19 వేల మందికి పైగా కరోనా భారినపడ్డారు. దాంతో సంస్థ వర్క్ ఫ్రం హోం ఆప్షన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఆప్షన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ సంస్థలలో పనిచేసే ఉద్యోగులందరికీ వర్తిస్తుందని కంపెనీ పేర్కొంది. ఆఫీస్‌కి వచ్చే వారి కోసం శారీరక దూరం, శానిటైజేషన్, ఉష్ణోగ్రత తనిఖీలు, ఫేస్ కవరింగ్ మరియు హ్యాండ్ శానిటైజర్‌ వంటి వాటిని సిద్ధంగా ఉంచినట్లు అమెజాన్ ప్రతినిధి చెప్పారు.

వివిధ ఇతర కంపెనీలు కూడా ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఆప్షన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. కంపెనీ ఉద్యోగులను నిరవధికంగా ఇంటి నుంచే పనిచేయడానికి అనుమతించిన మొదటి ప్రధాన టెక్ కంపెనీగా ట్విట్టర్ ఇంక్ నిలిచింది. మైక్రోసాఫ్ట్ కార్ప్ కూడా తమ ఉద్యోగులకు వారంలోని తమ పని గంటలలో సగం వరకు ఇంటి నుంచి పనిచేయడానికి వీలు కల్పిస్తుంది. ఫేస్‌బుక్ ఇంక్ తన ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేయడానికి వచ్చే ఏడాది జూలై వరకు అనుమతించింది. అదేవిధంగా గూగుల్ కూడా తమ కార్యాలయంలో ఉండాల్సిన అవసరం లేని ఉద్యోగుల కోసం వర్క్ ఫ్రం హోం వ్యవధిని జూన్ వరకు పొడిగించింది.

For More News..

జాలర్లను భయపెట్టిన ఒంటికన్ను షార్క్.. ఫొటోలు చూస్తే మీరు కూడా భయపడాల్సిందే..

ప్లేట్ బిర్యానీ రూ. 10 ఆఫర్.. అడ్డుకొని ఫ్రీగా పంచిపెట్టిన పోలీసులు

తెలంగాణలో కొత్తగా 1,579 కరోనా కేసులు