వచ్చే ఏడాది వరకు వర్క్ ఫ్రం హోం

వచ్చే ఏడాది వరకు వర్క్ ఫ్రం హోం

న్యూఢిల్లీ : లాక్ డౌన్ ప్ర‌క‌టించిన‌ప్ప‌ట్నుంచి సాఫ్ట్ వేర్ కంపెనీల‌తో పాటు ప‌లు ఈ- కామ‌ర్స్ కంపెనీలు త‌మ ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం అవ‌కాశాల‌ను క‌ల్పిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే కొన్నిచోట్ల లాక్ డౌన్ స‌డ‌లింపు ఇచ్చిన‌ప్ప‌టికీ‌ కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తుంది. కరోనా కేసుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగతుతోంది. ఈ క్ర‌మంలోనే ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగుల సంక్షేమం కోసం వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని వచ్చే ఏడాది జనవరి 8 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. కొవిడ్-19 కారణంగా మే నెలలో అక్టోబర్ 2 వరకు ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే విధులు నిర్వహించేందుకు అమెజాన్ అనుమతించింది.

అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు మరిన్ని పెరుగుతుండడంతో.. అక్టోబర్ నాటికి పరిస్థితులు మరింత ప్రమాద కరంగా మారే అవకాశం ఉడడంతో.. లేటెస్ట్ గా ఎంప్లాయూస్ వర్క్ ఫ్రం హోం గడువును పొడిగించింది. వ‌చ్చే ఏడాది జనవరి 8 వరకు ఉద్యోగులను ఇంటి వద్ద నుంచే పని చేయాలని సూచించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ కార్యాలయాలన్నిటికీ ఈ కొత్త‌ విధానం వర్తిస్తుందని తెలిపింది అమెజాన్.