సెప్టెంబర్ 27 నుంచి అమెజాన్ ఫెస్టివల్​ సేల్​

 సెప్టెంబర్  27 నుంచి అమెజాన్ ఫెస్టివల్​ సేల్​

హైదరాబాద్​, వెలుగు:   అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్  ఈ నెల 27న ప్రారంభం కానుంది. ప్రైమ్ సభ్యులకు ఇది 24 గంటలు ముందుగా అందుబాటులో ఉంటుంది. వేలాది ప్రొడక్టులపై ఆఫర్లు, డిస్కౌంట్లు ఇస్తామని ఈ–కామర్స్​కంపెనీ అమెజాన్​ ప్రకటించింది. ఎస్​బీఐ కార్డుతో కొంటే అదనంగా పది శాతం డిస్కౌంట్​ పొందవచ్చు.   ప్రైమ్ సభ్యులు తమ అమేజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే ఐదుశాతం అన్ లిమిటెడ్ క్యాష్ బాక్ ను దక్కించుకోవచ్చు. 

డెబిట్, క్రెడిట్ కార్డ్స్ పై నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం ఉంటుంది.  సేల్‌‌‌‌లో భాగంగా మొబైల్స్‌‌‌‌పై 40 శాతం, ఎలక్ట్రానిక్స్‌‌‌‌పై 75 శాతం, గృహోపకరణాలపై 50 శాతం, ఫ్యాషన్‌‌‌‌ ఉత్పత్తులపై 50-–80 శాతం, అమెజాన్ అలెక్సా ఉత్పత్తులపై 55 శాతం డిస్కౌంట్‌‌‌‌ ఇవ్వనున్నట్లు అమెజాన్​ ప్రకటించింది.