Holi 2024: అమెజాన్ హోలీ ఆఫర్..వీటిపై 70 శాతం డిస్కౌంట్

Holi 2024: అమెజాన్ హోలీ ఆఫర్..వీటిపై 70 శాతం డిస్కౌంట్

మరో రెండు రోజుల్లో  రంగుల పండుగ హోలీ.. ఈ ఏడాది పండుగ ఎప్పుడూ గుర్తిండిపోయేలా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ గొప్ప ఆఫర్లను ప్రకటించింది. అన్ని రకాల బ్రాండెడ్ వస్తువులపై 70 శాతం వరకు డిస్కౌంట్ ను అందిస్తోంది. మీరు బట్టలు, చెప్పులు, స్మార్ట్ వాచ్ లు కొనుగోలు చేయాలని అనుకుంటే.. అమెజాన్ భారీ తగ్గింపులను ఇస్తోంది మీకోసం..ఈ సీజన్ సేల్ లో పిల్లలు, పురు షులు, మహిళలు అందరికీ ఫ్యాషన్ ట్రెండ్ లను భారీ ఆఫర్లతో అందిస్తుంది.స్మార్ట్ వాచెస్, సన్ గ్లాసెస్, చెప్పులు, ఆర్నెమెంట్స్ పై డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. 

Also Read: ఐఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్

హోలీ 2024 కి అమెజాన్ అందిస్తున్న వివిధ ఆఫర్లు: 

మహిళలకు దుస్తులు:అమెజాన్ హోలీ షాపింగ్ స్టోర్ 2024లో మహిళల దుస్తులపై 70 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది బిబా , సోచ్ వంటి బ్రాండ్ లనుంచి లెవీస్ అండ్ ఓన్లీ వరకు సొగసైన ఎథ్నిక్ వేర్లపై ఈ ఆఫర్లు ఉన్నాయి.

పురుషుల కోసం: మహిళల దుస్తులతోపాటు కుర్తాలు, టీషర్టులు, మాన్యవర్, వస్త్రమాయ్, సింబల్ వంటి ప్రముఖ వార్డ్ రోబ్ బ్రాండ్ ల నుంచి మెన్స్ కు 70 శాతం డిస్కౌంట్ ను అందిస్తోంది అమెజాన్. 

పిల్లల దుకాణం: లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్ లో మీ పిల్లలకు దుస్తులు కొనాలకుంటే.. హోలీ సేల్ లో భాగంగా అమెజాన్ పిల్లల దుస్తులపై 70 శాతం తగ్గింపును అందిస్తుంది. సాంప్రదాయ డ్రెస్ లనుంచి  సాధారణ దుస్తుల వరకు అన్ని రకాల ఐటెమ్ లు ఉన్నాయి. 

ఫుట్ వేర్స్ :దుస్తులతోపాటు అమెజాన్ చెప్పులపై కూడా భారీ డిస్కౌంట్ ను అందిస్తోంద.Puma, Cros, Adidas వంటి బ్రాండెడ్ కంపెనీలు చెప్పులపై ఈ డిస్కౌంట్ ప్రకటించారు. స్నీకర్ల నుంచి సౌకర్యవంతమైన చెప్పుల వరకు ఈ ఉన్నాయి. 

ఆర్నమెంట్స్( ఆభరణాలు) : అమెజాన్ ఆన్ లైన్ షాపింగ్ ఫ్లాట్ ఫారమ్ నెక్లెస్ నుంచి చెవి పోగుల వరకు వివిధ రకాల ఆర్నమెంట్స్ (ఆభరణాలు) పై 80 శాతం తగ్గింపును ఇస్తోంది. వీటిలో పాటు 60 శాతం డిస్కౌంట్ తో సరికొత్త స్మార్ట్ వాచ్ లను అమెజాన్ అందిస్తోంది.Casio, Fastrack వంటి పెద్ద బ్రాండ్ లనుంచి వివిధ రకాల డిజైన్లను బ్రౌజ్ చేయొచ్చు. 

సో.. ఎంజాయ్ ది ఆఫర్స్..