
న్యూఢిల్లీ: అమెజాన్ ఇండియా తన క్విక్ కామర్స్ సర్వీస్ 'అమెజాన్ నౌ'ను బెంగళూరులోని కొన్ని పిన్ కోడ్స్‌లో అందుబాటులోకి తెచ్చింది. ఇండియాలో క్విక్ కామర్స్ ఇండస్ట్రీ వేగంగా వృద్ధి చెందుతోంది. ఇందులోకి అమెజాన్ కూడా ఎంట్రీ ఇచ్చింది. తమ సర్వీస్‌లకు మంచి రెస్పాన్స్ వస్తోందని, ముఖ్యంగా ప్రైమ్ మెంబర్ల నుంచి మంచి రెస్పాన్స్ ఉందని అమెజాన్ పేర్కొంది.
"అమెజాన్ నౌ ద్వారా మేము రోజువారి అవసరాలకు వాడుకునే ఐటెమ్స్‌ను 10 నిమిషాల్లో డెలివరీ చేస్తున్నాం. కస్టమర్ అవసరాలను వెంటనే తీరుస్తున్నాం. క్వాలిటీ, నమ్మదగ్గ సర్వీస్‌లను అందిస్తున్నాం" అని కంపెనీ స్పోక్స్‌పర్సన్ తెలిపారు. తన క్విక్‌కామర్స్ బిజినెస్‌ను రానున్న నెలల్లో మరింతగా విస్తారించాలని అమెజాన్ చూస్తోంది. బెంగళూరులో మరిన్ని ఏరియాలకు, ఆ తర్వాత ఇతర సిటీలకు విస్తరిస్తామని ప్రకటించింది.