
న్యూఢిల్లీ: అమెజాన్ ఆన్ లైన్ ఫార్మసీ బిజినెస్ చట్టబద్దం కాదని ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్, డ్రగ్గిస్ట్ స్ (ఏఐఓసీడీ) ఈ–కామర్స్ కంపెనీ అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ కి లెటర్ రాసింది. ఈ లెటర్ కాపీలను ప్రధాని మోడీకి, ఇతర ప్రభుత్వ ఆఫీసర్లకు కూడా పంపింది. డ్రగ్స్, కాస్మో టిక్స్ యాక్ట్, ఆన్ లైన్ ఫార్మసీపై ఢిల్లీ హైకోర్ట్ ఇచ్చిన స్టేకు వ్యతిరేకంగా ఆన్ లైన్ ఫార్మసీ బిజినెస్ ను అమెజాన్ స్టార్ట్ చేసిందని విమర్శించింది. ఎమర్జెన్సీ కాబట్టే లాక్ డౌన్ టైమ్‌లో ఆన్ లైన్ ఫార్మసీ సేల్స్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపింది. అమెజాన్ ప్రకటన ఢిల్లీ హైకోర్ట్ నిర్ణయానికి వ్యతిరేకమని పేర్కొంది.