
హైదరాబాద్, వెలుగు: ఈ సారి నిర్వహించిన ప్రైమ్ డే 2025, సంస్థ చరిత్రలోనే అత్యంత భారీ షాపింగ్ ఈవెంట్‌గా నిలిచిందని అమెజాన్ ఇండియా ప్రకటించింది. ఈనెల 12 నుంచి 14 వరకు జరిగిన ఈ మూడు రోజుల సేల్లో నిమిషానికి18 వేలకుపైగా ఆర్డర్లు వచ్చాయని, గతేడాదితో పోలిస్తే 50శాతం ఎక్కువని పేర్కొంది. ఈ విజయంలో చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థల వాటా కూడా బాగా పెరిగింది.
కొత్తగా ప్రైమ్ సభ్యత్వం తీసుకున్నవారిలో 70శాతం మంది టైర్-2, టైర్-3 నగరాల వాళ్లు. స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ వంటి వాటికి భారీ డిమాండ్ కనిపించింది. 400కు పైగా ప్రముఖ బ్రాండ్లు తమ కొత్త ఉత్పత్తులను ఈ సేల్ ద్వారా విడుదల చేశాయి. నో-కాస్ట్ ఈఎంఐ, క్రెడిట్ కార్డు ఆఫర్ల వంటి సౌకర్యాలను కస్టమర్లు ఎక్కువగా ఉపయోగించుకున్నారని అమెజాన్ తెలిపింది.