
హైదరాబాద్, వెలుగు: ఎలక్ట్రానిక్స్ వస్తువులను అప్‌గ్రేడ్ చేయడానికి ప్రైమ్ డే డీల్స్‌ను ప్రారంభించామని అమెజాన్ ప్రకటించింది. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నామని తెలిపింది. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, హోం అప్లయెన్సెస్, ఇతర గాడ్జెట్‌లపై భారీ తగ్గింపులు లభిస్తున్నాయని పేర్కొంది.
పాత వస్తువులను మార్చుకోవాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశమని, ఇంటికి కావాల్సిన అత్యాధునిక ఎలక్ట్రానిక్స్ వస్తువులను తక్కువ ధరలకే కొనుగోలు చేయొచ్చని అమెజాన్సీనియర్ఎగ్జిక్యూటివ్ ఒకరు అన్నారు. ఈ ప్రత్యేక ఆఫర్లు పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటాయని చెప్పారు.
శామ్ సంగ్, యాపిల్, వన్ ప్లస్, సోనీ, బోట్, జేబీఎల్, ఎల్జీ వంటి బ్రాండ్స్ ప్రొడక్టులపై డీల్స్ ఉంటాయని పేర్కొన్నారు. ప్రైమ్‌డే సేల్ఈ నెల 12–14 తేదీల మధ్య జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.