Amazon prime: సబ్‌స్క్రిప్షన్ చార్జీలు భారీగా పెంచిన అమెజాన్‌ ప్రైమ్

Amazon prime: సబ్‌స్క్రిప్షన్ చార్జీలు భారీగా పెంచిన అమెజాన్‌ ప్రైమ్

ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ తన యూజర్లకు షాకిచ్చింది. సబ్‌స్క్రిప్షన్‌ ధరలు భారీగా పెంచేసింది. ఇందులో భాగంగా నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌  67 శాతం పెంచగా.. త్రైమాసిక ప్లాన్ కూడా పెంచేసింది. అయితే.. వార్షిక ప్లాన్‌ లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు.

ఇక పెరిగిన సబ్‌స్క్రిప్షన్‌ ధరలు తక్షణమీ అమల్లోకి రానున్నాయని తెలిపింది. అయితే.. ఇప్పటికే ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ యాక్టివ్ లో ఉన్న వారికి వచ్చే ఏడాది జనవరి 15 వరకు పాత ధరలే అమలులో ఉంటాయని, ఒకవేళ ఏ కారణంతోనైనా రెన్యూవల్‌ ఫెయిలైతే కొత్త  ప్లాన్లు కొనుగోలు చేయాల్సిందని వివరించింది.

ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ రూ.179 కాగా, తాజాగా రూ.299లకు పెరిగింది. మూడు నెలల సబ్‌స్క్రిప్షన్‌ రూ.459 నుంచి 599కి, వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ రూ.1499గా ఉంది. అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ పొందిన వినియోగదారులకు ఆర్డర్‌ విలువతో సంబంధం లేకుండా ఫ్రీ-డెలివరీ, ప్రైమ్‌ వీడియో, ప్రైమ్‌ మ్యూజిక్‌, ప్రైమ్‌ రీడింగ్‌ వంటి ఫెసిలిటీస్ అమెజాన్‌ అందిస్తోంది.