Mirzapur Season 3: మీర్జాపూర్ లవర్స్ గెట్ రెడీ.. అధికారిక ప్రకటన వచ్చేసింది

Mirzapur Season 3: మీర్జాపూర్ లవర్స్ గెట్ రెడీ.. అధికారిక ప్రకటన వచ్చేసింది

మీర్జాపూర్‌(Mirzapur).. ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఇండియన్ ఇండస్ట్రీకి బోల్డ్ కంటెంట్ పరిచయం చేసిందే ఈ సిరీస్ అని చెప్పుకోవచ్చు. డైలాగ్స్ పరంగా కానీ, సన్నివేశాల పరంగా కానీ లిమిట్స్ ను క్రాస్ చేసింది ఈ సిరీస్. అందుకే ఈ సిరీస్ చాలా మందికి స్పెషల్. అంతేకాదు చాలా మందికి మోస్ట్‌ పాపులర్‌ క్రైమ్‌ అండ్ పొలిటికల్ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌ లిస్టులో ఉంటుంది మీర్జాపూర్.

ఇప్పటికే ఈ సిరీస్ రెండు సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఇక అప్పటి నుండి మీర్జాపూర్ మూడో సీజన్‌ కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే.. తాజాగా వారి ఎదురుచూపులకి ఎండ్ కార్డు వేస్తూ.. సీజన్ 3పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మీర్జాపూర్‌ సీజన్ 3 విడదల తేదీని ప్రకటిస్తూ.. ఆఫీసియల్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. జులై 5 నుంచి ఈ మీర్జాపూర్ సీజన్ 3 స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. దీంతో మీర్జాపూర్ లవర్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. మరి మొదటి రెండు సీజన్స్ లాగే ఈ సీజన్ కూడా భారీ విజయం సాధిస్తుందా చూడాలి.