
బ్యాడ్ న్యూస్..ప్రముఖ OTTప్లాట్ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో తన కస్టమర్లకు భారీ షాక్ ఇవ్వబోతోంది. అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ మరింత భారం కానుంది. వచ్చే నెలనుంచి అదనపు సబ్ స్క్రిప్షన్ ఖర్చుతో కస్టమర్ల జేబులకు చిల్లులు పెట్టనుంది. డైరెక్టుగా సబ్ స్క్రిప్షన్ చార్జీలు పెంచకుండా యాడ్ ఫ్రీ, యాడ్ ఆన్ ప్లాన్ల ద్వారా కస్టమర్లనుంచి అదనపు ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్దమవుతోంది.
జూలై 17 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో వెబ్ సిరీస్‌లు, సినిమాలు,షోలను చూడటం ఇకపై మరింత ఖరీదు కానున్నాయి. కంపెనీ నెలవారీ, వార్షిక సబ్ స్క్రిప్షన్ ఫీజులను పెంచాలని యోచిస్తోంది.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో యాడ్స్ తో కూడిన కంటెంట్ అందించనుంది. యాడ్స్ లేకుండా సినిమాలు, వెబ్ సిరీస్ లు, షోలు ఆస్వాదించాలంటే యాడ్స్ లేకుండా ఉండే ప్లాన్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది. దీనర్థం కస్టమర్ పై అదనపు భారం పడనుంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రస్తుతం మూడు సబ్ స్క్రిప్షన్ ప్లాన్లను అందిస్తుంది. ప్రైమ్ షాపింగ్ ఎడిషన్, ప్రైమ్ లైట్ ,స్టాండర్డ్ ప్రైమ్ సర్వీస్. రిపోర్టుల ప్రకారం.. వచ్చే నెల నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో యాడ్స్ లేని కంటెంట్ కావాలంటే అదనంగా యాడ్ ఫ్రీ..యాడ్ ఆన్ ప్లాన్ ను తప్పక తీసుకోవాల్సిందే. యాడ్ ఫ్రీ సబ్ స్క్రిప్షన్ కోసం అదనంగా నెలకు రూ. 129, సంవత్సరానికి 699 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
ప్రైమ్ షాపింగ్ ఎడిషన్: ఈ ప్లాన్ మొత్తం సంవత్సరానికి రూ. 399 ఖర్చవుతుంది. కానీ ఇందులో ప్రైమ్ వీడియో వంటి సేవలు ఉండవు.
ప్రైమ్ లైట్: సంవత్సరానికి రూ.799లకు ఈ ప్లాన్ కస్టమర్లకు ప్రైమ్ సర్వీస్ అన్ని బెనిఫిట్స్ అందిస్తుంది.వాటిలో 720p క్వాలిటీ వీడియో స్ట్రీమింగ్ కూడా ఉంటుంది.
స్టాండర్డ్ ప్రైమ్: సంవత్సరానికి రూ. 1499 ఖర్చుతో ఇది అన్ని ఇతర బెనిఫిట్స్ తో పాటు HD వీడియో యాక్సెస్‌ను అందిస్తుంది.
రాబోయే మార్పులు ఏంటంటే..
సంవత్సరానికి రూ.699 , నెలకు రూ.129 యాడ్-ఫ్రీ యాడ్-ఆన్ సర్వీస్ ప్రవేశపెట్టడంతో స్టాండర్డ్ ప్రైమ్ సర్వీస్ కోసం మొత్తం ఖర్చు సంవత్సరానికి రూ.2198లకు పెరుగుతుంది. అదే సమయంలో ప్రైమ్ లైట్ కస్టమర్లు అదే బెనిఫిట్ కోసం సంవత్సరానికి మొత్తం రూ.1498 ఖర్చు చేయాల్సి ఉంటుంది.
నెలవారీ ప్లాన్‌లను పరిశీలిస్తే కస్టమర్లు ప్రస్తుతం స్టాండర్డ్ ప్లాన్ కోసం రూ.299 చెల్లిస్తున్నారు. యాడ్-ఫ్రీ యాడ్-ఆన్‌తో ఇది నెలకు రూ.428లకు పెరగనుంది.
సబ్ స్క్రిప్షన్ ప్రణాళిక ధర అదనపు ఛార్జీలు కొత్త ధర
ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ (12 నెలలు) రూ. 399 రూ. 399
ప్రైమ్ లైట్ (12 నెలలు) రూ. 799 రూ. 699 (12 నెలలు) రూ.1498
స్టాండర్డ్ ప్రైమ్ (12 నెలలు) రూ.1499 రూ. 699 (12 నెలలు) రూ. 2198
స్టాండర్డ్ ప్రైమ్ (1 నెల) రూ. 299 రూ. 129 (1 నెల) రూ. 428
స్టాండర్డ్ ప్రైమ్ క్వార్టర్లీ (3 నెలలు) రూ. 599 రూ. 699 (12 నెలలు) రూ.1298
ఈ మార్పులతో పాటు అమెజాన్ ఇటీవల ప్రైమ్ వీడియోను ఒకేసారి యాక్సెస్ చేయగల డివైజ్ ల సంఖ్యను తగ్గించింది. గతంలో కస్టమర్లు 10 డివైజ్ లలో లాగిన్ అయ్యేవారు. కానీ ఇప్పుడు ఈ సంఖ్య ఒకేసారి రెండు డివైజ్ లకు మాత్రమే పరిమితం చేసింది.