
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఓటీటీల హవా నడుస్తోంది. ఆడియన్స్ థియేటర్స్ కంటే ఎక్కువ ఓటీటీల వైపే మొగ్గుచూపుతున్నారు. తక్కువ ధరతో ఇంటిల్లిపాది కలిసి సినిమాలు చూసేయొచ్చు. మల్లి ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. దర్జాగా ఇంట్లోనే కూర్చొని ఏ సినిమా అంటే ఆ సినిమా చూసే వీలుంటుంది. దాంతో.. ఓటీటీలు కూడా కొత్త కొత్త కంటెంట్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి.
ఇక్కడివరకు బాగానే ఉన్నా.. నెలసరి సబ్స్క్రిప్షన్ చార్జెస్ విషయంలో మాత్రం ఆడియన్స్ కు చుక్కలు చూపిస్తున్నాయి ఓటీటీ ప్లాట్ఫామ్స్. తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ తమ వినియోగదారులకు షాకిచ్చింది. అదేంటంటే.. ఇక నుండి సినిమా మద్యలో ప్రకటనలు రాకుండా అదనంగా చార్జెస్ వాసులు చేయనుంది. దీంతో అమెజాన్ వినియోగదారులు అవాక్కవుతున్నారు.
నిజానికి చాలా ఓటీటీ లలో సినిమా ప్రసారం మధ్య వాణిజ్య ప్రకటనలు రావు కానీ.. అమెజాన్ ప్రైమ్ వినియోగదారులు మాత్రం ిన నుండి సినిమాలతో పాటు ప్రకటనలను కూడా చూడాల్సి ఉంటుంది. కారణం.. 2024 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో వాణిజ్య ప్రకటనలు ప్రసారం అవుతాయని సంస్థ ఇప్పటికే వెల్లడించింది. అయితే.. ప్రకటనలు స్కిప్ చేయాలనుకునే వారు అందుకోసం అదనంగా రూ. 250 చెల్లించాల్సి ఉంటుంది. అంటే మంత్లీ సబ్స్క్రిప్షన్ చార్జెస్ కాకుండా అదనంగా మరో రూ.250 పే చేయాల్సి ఉంటుంది. మరి ఈ నిర్ణయం పట్ల అమెజాన్ ప్రైమ్ వినియోగదారులు ఎలా స్పందిస్తారో చూడాలి.