- 26 నుంచి అమెజాన్ ప్రైమ్ డే సేల్
- 2 రోజులపాటు డిస్కౌంట్లు
- ప్రైమ్ కస్టమర్లకు 50 శాతం వరకు తగ్గింపు
- 300 కొత్త ప్రొడక్టుల లాంచ్
- సినిమాలు, వెబ్ సిరీస్‌లు కూడా..
బిజినెస్ డెస్క్, వెలుగు: ఆన్‌లైన్ షాపింగ్ కంపెనీ అమెజాన్ ఏటా నిర్వహించే ప్రైమ్‌డే సేల్ ఈ నెల 26, 27 తేదీల్లో జరుగుతుంది. ఈ సందర్భంగా వేలాది ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లు ఇస్తామని, కొన్ని ప్రొడక్టులపై ప్రైమ్ కస్టమర్లకు 50 శాతం వరకు తగ్గింపు ఉంటుందని అమెజాన్ ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో కొనే వారికి 10 శాతం డిస్కౌంట్ అదనంగా ఇస్తారు. ప్రైమ్‌డే సేల్ ఈ ఏడాది మేలోనే జరగాల్సి ఉన్నా, కరోనా వల్ల వాయిదా పడింది. ‘‘ఈసారి ప్రైమ్‌డేను మా లక్షలాది మంది స్మాల్ బిజినెస్‌లకు, లోకల్ సెల్లర్లకు అంకితం ఇస్తున్నాం. ఈ కష్టకాలంలో ప్రైమ్‌డే ద్వారా వారిని ఆదుకుంటాం. ప్రైమ్‌డేకు ముందే స్మాల్ బిజినెస్ సెల్లర్ల ప్రొడక్టులు కొన్న వారికి సేల్ రోజు రూ.150 క్యాష్‌బ్యాక్ అదనంగా ఇస్తాం’’ అని అమెజాన్ ఇండియా కంట్రీహెడ్ అమిత్ అగర్వాల్ చెప్పారు.
ఈసారి ప్రైమ్‌డే సేల్ విశేషాలు
- అమెజాన్ ఇన్ హౌస్ ప్రొడక్టులు కిండిల్, ఫైర్ టీవీ, ఫైర్ స్టిక్ వంటి డివైజ్‌లపై ప్రైమ్ కస్టమర్లకు 50 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తారు. కొత్తగా లాంచ్ చేసిన ఇకో షో 10, ఫైర్ టీవీ క్యూబ్ ప్రైమ్‌డే సేల్ ద్వారా ఆర్డర్ చేయొచ్చు. అలెక్సా బల్బ్, స్పీకర్ వంటి ప్రొడక్టులపై టెంపరరీ డిస్కౌంట్ ఉంటుంది.
- ఇంటెల్, బోట్, మైగ్లామ్, మామాఎర్త్, శామ్‌సంగ్, క్యాడ్‌బరీ వంటి కంపెనీల 300 ప్రొడక్టులు లాంచ్ అవుతాయి. పాపులర్ రైటర్లు రాసిన 8 కొత్త బుక్స్‌ను కూడా ఆర్డర్ చేయవచ్చు.
- సేల్ సందర్భంగా అమెజాన్ ఏడాది ప్రైమ్ మెంబర్‌షిప్‌ను రూ.వెయ్యికి పొందవచ్చు. 3 నెలలకు అయితే రూ.329 చెల్లిస్తే చాలు. తూఫాన్, మాలిక్, పరంబరాయి, ఇక్కత్ వంటి కొత్త సినిమాలు ప్రైమ్ వీడియో ప్లాట్‌ఫామ్ ద్వారా రిలీజ్ అవుతాయి. హాస్టల్ డేజ్ అమెజాన్ ఒరిజనల్ సిరీస్ 23న వస్తుంది.
- అమెజాన్ లాంచ్‌ప్యాడ్ ద్వారా 6.80 లక్షల మంది మహిళా ఎంట్రప్రిన్యూర్లు, 50 వేల కిరాణాలు, లక్షలాది మంది చిన్న వ్యాపారులు డిస్కౌంట్ ధరలతో ప్రొడక్టులను అమ్ముతారు. స్మాల్ బిజినెస్‌లు రెండు వేల కొత్త ప్రొడక్టులను లాంచ్ చేస్తాయి. వీటిలో ఫ్యాషన్, జ్యూయలరీ, గ్రాసరీ, ఖాదీ, చేనేత వస్తువులు ఉంటాయి.
- స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, కిచెన్ సామాన్లు, నిత్యావసరాలు, బొమ్మలు, దుస్తులు, బ్యూటీ ప్రొడక్టులను తక్కువ ధరలకు కొనుక్కోవచ్చని అమెజాన్ ప్రకటించింది. అమెజాన్‌పే ఐసీఐసీఐ క్రెడిట్‌కార్డు ద్వారా ఐదుశాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. మొబైల్స్‌పై 40 శాతం వరకు, ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లియెన్సెస్‌పై 60 శాతం డిస్కౌంట్ ఇస్తామని అమిత్ అగర్వాల్ వివరించారు.
