అమెజాన్ మిస్టేక్..రూ.9 లక్షల కెమెరా రూ.6500కే

అమెజాన్ మిస్టేక్..రూ.9 లక్షల కెమెరా రూ.6500కే

న్యూయార్క్​: వెయ్యి రూపాయల వస్తువుపై 200 డిస్కౌంట్​ వచ్చిందంటేనే ఎగిరి గంతేసేటోళ్లున్నరు. అలాంటిది ఏకంగా 99 శాతం డిస్కౌంట్​వస్తదంటే.. ఏం చేస్తరు? వెయ్యి రూపాయలది ఒక్క రూపాయికి వచ్చేస్తే ఏమైతరు? అమెరికన్లకు అమెజాన్​లో అలాంటి బంపరాఫరే తగిలింది. ₹9 లక్షలు (13 వేల డాలర్లు) విలువైన వస్తువును కేవలం ₹6500కే (94 డాలర్లు) కొనేసి లక్కుల పడిపోయినరు. దానికి కారణం సాంకేతిక లోపం. ఎప్పటిలాగే ఈ సారీ అమెజాన్​ ప్రైమ్​ డే ఆఫర్​ పెట్టింది. అయితే, తప్పు ఎక్కడ జరిగిందో ఏమో గానీ, చాలా ఖరీదైన కెమెరాల ధరల డిస్కౌంట్​ తప్పుగా పడిపోయింది. 13 వేల డాలర్ల విలువైన కెమెరాలు, వాటి లెన్సులను 94 డాలర్లకే అమ్మేసింది. ఓ వ్యక్తి అయితే, ఏకంగా 5 కెమెరా లెన్సులకు ఆర్డర్​ పెట్టేశాడు. 65 వేల డాలర్ల (₹44.75 లక్షలు) విలువైన ఆ వస్తువులను అప్పనంగా 500 డాలర్లకే (₹34,430) సొంతం చేసుకున్నాడు. వెంటనే సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశాడు. డీల్​ ఆ నోటా, ఈ నోటా పాకి అందరికీ చేరడంతో, ‘మాకు ఒకటి’ అంటూ ఆర్డర్​ పెట్టారు. మరో వ్యక్తి 3 వేల డాలర్ల (₹2 లక్షలకు పైనే) విలువైన టెలిస్కోపును  ₹6500కే కొన్నాడట. చివరకు ఈ ‘తప్పు’ డీల్​ గురించి అమెజాన్​ పెద్దలకు తెలియడంతో ఆ తప్పును సరిచేశారు. కానీ, అప్పటికే జరగరాని నష్టం జరగడంతో తలలు పట్టుకున్నారు. డీల్​ను కరెక్ట్​ టైంలో వాడేసుకున్న  యూజర్లు మాత్రం ‘థాంక్స్​, బెజోస్​’ అంటూ కామెంట్లు చేశారు.