వచ్చే నెలలో ఫుడ్ బిజినెస్ కు అమెజాన్ గుడ్ బై

వచ్చే నెలలో ఫుడ్ బిజినెస్ కు అమెజాన్ గుడ్ బై

ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ వచ్చే నెల (డిసెంబరు)లో ఫుడ్ డెలివరీ వ్యాపారం నుంచి వైదొలగనుంది. పైలట్ ప్రాజెక్టు ప్రాతిపదికన 2020 మేలో బెంగళూరు నగరం కేంద్రంగా ప్రారంభించిన ‘అమెజాన్ ఫుడ్’ సర్వీసు అంతగా ప్రజాదరణను పొందలేకపోయింది. దీంతో ఆ వ్యాపారాన్ని మూసివేయాలని అమెజాన్ నిర్ణయించింది. డిసెంబరు 29లోగా  ఫుడ్ డెలివరీ బిజినెస్ మూసివేత ప్రక్రియ పూర్తవుతుందని అమెజాన్ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈవిషయాన్ని తమ భాగస్వామ్య రెస్టారెంట్లకు ఇప్పటికే తెలియజేశామన్నారు. 

అయితే స్విగ్జీ, జొమాటోల మాదిరిగా అమెజాన్ ఫుడ్ డెలివరీ బిజినెస్ కు బెంగళూరు నగరంలో తగిన స్పందన లభించలేదు. బెంగళూరులోని 62 ప్రాంతాలకు అమెజాన్ ఫుడ్ సర్వీసులను విస్తరించినప్పటికీ తగిన సంఖ్యలో ఆర్డర్లు రాలేదు. దీంతోపాటు ఇటీవల ‘అమెజాన్ అకాడమీ’ని కూడా కంపెనీ మూసివేసింది. హైస్కూల్ విద్యార్థులకు ఆన్ లైన్ లెర్నింగ్ ప్లాట్ ఫామ్ గా ఉంటుందనే ఉద్దేశంతో ‘అమెజాన్ అకాడమీ’ని  2020 సంవత్సరం ప్రారంభంలో సరిగ్గా కరోనా టైంలో ప్రారంభించారు. దానికి కూడా తగిన ఆదరణ లభించకపోవడంతో మూసివేశారు.