మే 31 నుంచి వార్డ్ రోబ్ రిఫ్రెష్ సేల్

మే 31 నుంచి వార్డ్ రోబ్ రిఫ్రెష్ సేల్

హైదరాబాద్​, వెలుగు :  ఈ–కామర్స్​ కంపెనీ అమెజాన్ ఈ నెల 31 నుంచి ఫ్యాషన్ లవర్స్​కోసం వార్డ్ రోబ్ రిఫ్రెష్ సేల్​ను ప్రారంభించనుంది. వేసవి కోసం ప్రత్యేక డిజైన్లను అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపింది.  కస్టమర్స్​కు వేలల్లో డిజైన్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది.  బిబా, అలెన్ సోల్లి, వాన్ హ్యూసేన్, క్రోక్స్, ప్యూమా, మైఖేల్ కోర్స్, టైటా, ఫాస్ట్ ట్రాక్, గివా, బిబా, లావీ, డవ్, సఫారి, అమెరికన్ టూరిస్టర్, పియోరా, యుబెల్లా వంటి 1500లకుపైగా బ్రాండ్‌‌ల నుంచి వేసవి దుస్తులను కొనుగోలు చేయవచ్చు.

 ఈ సందర్భంగా భారీ డిస్కౌంట్లూ పొందవచ్చని అమెజాన్​ పేర్కొంది. వచ్చే నెల ఐదో తేదీ వరకు సేల్​ కొనసాగుతుంది. కస్టమర్స్ 'స్టీల్ డీల్స్' తో, కనీసం 60శాతానికిపైగా తగ్గింపును పొందవచ్చు.  ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డ్స్ తో 10శాతం అదనంగా ఆదా చేయవచ్చు. అన్ని ప్రీపెయిడ్ లావాదేవీలపై ప్రైమ్ కస్టమర్స్ అదనంగా 10శాతం క్యాష్ బాక్ పొందవచ్చని అమెజాన్​ తెలిపింది.