రిలయన్స్​పై గెలిచిన అమెజాన్​

రిలయన్స్​పై గెలిచిన అమెజాన్​
  • ఫ్యూచర్​ గ్రూప్​తో మెర్జర్​ డీల్​కు ఝలక్

న్యూఢిల్లీ: రిలయన్స్​రిటెయిల్​, ఫ్యూచర్​ రిటెయిల్​ లిమిటెడ్​ల మెర్జర్​ డీల్​కు సుప్రీం కోర్టు బ్రేకు వేసింది. ఆన్​లైన్ బిజినెస్​లో అతి పెద్ద కంపెనీ అమెజాన్​కు అనుకూలంగా తీర్పును వెల్లడించింది. అమెజాన్​కు అనుకూలంగా గతంలో సింగపూర్​ ఎమర్జన్సీ ఆర్బిట్రేటర్​ జారీ చేసిన అవార్డు చెల్లుతుందని, మన దేశపు చట్టాల కింద దానిని అమలు చేయాల్సిందేనని సుప్రీం కోర్టు గురువారం స్పష్టం చేసింది. జస్టిస్​ ఆర్​ ఎఫ్​ నారిమన్ బెంచ్​ ఈ కేసుపై తన తీర్పును వెలువరించింది. విదేశీ ఎమర్జన్సీ ఆర్బిట్రేటర్​లు జారీ చేసే అవార్డు మన దేశంలో చెల్లుతుందా లేదా అనే అంశాన్ని లోతుగానే సుప్రీం కోర్టు బెంచ్​ పరిశీలించింది. ఎమర్జన్సీ ఆర్బిట్రేటర్ (ఈఏ)​ మన దేశపు చట్టాల ప్రకారం ఆర్బిట్రేటర్​ కాదని, మన చట్టాలలో ఎక్కడా ఆ ప్రస్తావనే కనబడదని ఫ్యూచర్​ రిటెయిల్​ లిమిటెడ్​ వాదించింది. రిలయన్స్​ రిటెయిల్​, ఫ్యూచర్​ రిటెయిల్​ లిమిటెడ్​లు ప్రకటించిన మెర్జర్​ డీల్​ విలువ రూ. 24,731 కోట్లు.ఈఏ ఆర్డరు సెక్షన్​ 17(1) కింద వస్తుందని, ఆర్బిట్రేషన్​ అండ్​ కాన్సిలేషన్​ యాక్ట్​లోని 17 (2) కింద దానిని అమలు చేయమని కోరవచ్చని సుప్రీం కోర్టు వెల్లడించింది. అమెజాన్​కు అనుకూలంగా ఈఏ జారీ చేసిన అవార్డు మన దేశంలో అమలు చేయదగ్గదేనని ఇంతకు ముందు ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పుతో తాము ఏకీభవిస్తున్నట్లు సుప్రీం కోర్టు బెంచ్​ పేర్కొంది. రిలయన్స్​ రిటెయిల్​తో మెర్జర్​కు ఒప్పుకున్న ఫ్యూచర్​ రిటెయిల్​ లిమిటెడ్​పై అమెజాన్​ కేసు వేసింది. డీల్​ను ఆపేయాలని కోర్టును కోరింది. ఇప్పటికే సింగపూర్​లోని ఎమర్జన్సీ ఆర్బిట్రేటర్​ తమకు అనుకూలంగా ఇచ్చిన తీర్పు ఇండియాలోని చట్టాలకు అనుగుణమేనని వాదించింది. రెండు పక్షాలూ తాజా తీర్పుపై ఇంకా స్పందించలేదు. కాకపోతే, ఫ్యూచర్​ గ్రూప్​ రివ్యూ పిటిషన్ ఫైల్​ చేసే అవకాశం ఉందని ఎక్స్​పర్టులు చెబుతున్నారు. అమెజాన్​ తరఫున గోపాల్​ సుబ్రమణియం, ఫ్యూచర్​ తరఫున హరీష్​ సాల్వేలు ఈ కేసును వాదించారు.