అత్యంత ధనవంతుడు అంబానీ.. సంపద రూ.9.55 లక్షల కోట్లు: హురున్ రిచ్‌‌‌‌ లిస్ట్‌‌‌‌

అత్యంత ధనవంతుడు అంబానీ.. సంపద రూ.9.55 లక్షల కోట్లు: హురున్ రిచ్‌‌‌‌ లిస్ట్‌‌‌‌

న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీ ఫ్యామిలీ మరోసారి భారతదేశంలో అత్యంత సంపన్నమైన కుటుంబంగా నిలిచింది. ఎం3ఎం హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025  ప్రకారం, వీరి  సంపద రూ.9.55 లక్షల కోట్లు. గౌతమ్ అదానీ కుటుంబం రూ.8.15 లక్షల కోట్లతో రెండో స్థానంలో ఉంది.

 భారతదేశంలో బిలియనీర్ల మొత్తం సంఖ్య 350 దాటింది. 13 ఏళ్లలో 6 రెట్లు పెరగడం విశేషం. వీరి మొత్తం సంపద రూ.167 లక్షల కోట్లు, ఇది భారత జీడీపీలో సగానికి సమానం. ధనవంతులు ఎక్కువగా నివసిస్తున్న సిటీల్లో   451 మంది బిలియనీర్లతో ముంబై అగ్రస్థానంలో ఉంది. తర్వాత ఢిల్లీ (223), బెంగళూరు (116) ఉన్నాయి. ఫార్మాస్యూటికల్స్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో 137 మంది బిలియనీర్లు ఉన్నారు. 

ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ (132), కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ (125) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఈ రిచ్‌‌‌‌ లిస్ట్‌‌‌‌లో 101 మంది మహిళలు ఉన్నారు. రోష్ని నాడార్ రూ.2.84 లక్షల కోట్ల సంపదతో అంబానీ, అదానీ తర్వాత మూడో స్థానంలో నిలిచారు. రిచ్‌‌‌‌లిస్ట్‌‌‌‌లో 66శాతం మంది సెల్ఫ్‌‌మేడ్‌‌ బిలియనీర్లు కావడం విశేషం.